twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అత్తారింటికి దారేది’ 100 డేస్ ఎన్ని సెంటర్లలో అంటే..?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ సూపర్ హిట్'అత్తారింటికి దారేది' చిత్రం ఇప్పటికే కలెక్షన్ల పరంగా పలు రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం 100 రోజుల వేడుకకు సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈచిత్రం 32 సెంటర్లలో 100 రోజులు జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది.

    ఇప్పటికే ఈ చిత్రం కలెక్షన్ల పరంగా నైజాం, సీడెడ్, ఓవర్సీస్ ఏరియాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. వైజాగ్, గుంటూరు, కర్ణాటక లాంటి ఏరియాల్లో మగధీర రికార్డులను తుడిచిపెట్టింది. ప్రస్తుతం తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించిన అత్తారింటికి దారేది.....రూ. 100 కోట్ల వసూళ్లను అందుకునే దిశగా పరుగులు పెడుతోంది.

     AD 100 days in 32 centers

    పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

    నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    అత్తారింటికి దారేది 100 డేస్ సెంటర్స్ లిస్ట్

    నైజాం ఏరియాలో 4 సెంటర్లు
    సీడెడ్ ఏరియాలో 11 సెంటర్లు
    వైజాగ్ ఏరియాలో 1 సెంటర్
    కృష్ణ జిల్లాలో 4 సెంటర్లు
    గుంటూరు ఏరియాలో 4 సెంటర్లు
    ఈస్ట్ గోదావరిలో 6 సెంటర్లు
    వెస్ట్ గోదావరిలో 2 సెంటర్లు

    English summary
    
 Pawan Kalyan's Attarintiki Daredi has turned out to be a blockbuster and the film is all set to complete 100 days run in 32 direct centers in the state. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X