Don't Miss!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పెళ్ళికి ముందురోజు బాయ్‌ఫ్రెండ్స్‌తో.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా.. ఓపెన్ అయిన ఆదా శర్మ
'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆదా శర్మ. ఆ తర్వాత తన బోల్డ్నెస్తో పలు సినిమాల్లో ఆకట్టుకుంది ఆదా. హాట్ హాట్ దుస్తులతో ఇటు సోషల్ మీడియాలోనూ ఆదా శర్మ జోష్ ఎక్కువే. ఈ మధ్య కాస్త సినిమా అవకాశాలు తగ్గటంతో ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ పై పడింది ఈ అమ్మడు. ఈ నేపథ్యంలోనే హాట్ ఫోటో షూట్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ కుర్రకారును మత్తెక్కిస్తోంది. కాగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది ఆదా శర్మ. వివరాల్లోకి పోతే..
'ది హాలిడే' వెబ్ సీరీస్
ప్రస్తుతం బాలీవుడ్ లో మూడు సినిమాల్లో నటిస్తున్న ఆదా శర్మ 'ది హాలిడే' అనే వెబ్ సీరీస్‌లో కూడా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదా.. ఇందులోని ఆసక్తికర సన్నివేశాల గురించి వివరించింది. తాను ఈ వెబ్ సిరీస్‌లో మెహెక్ అనే అమ్మాయిగా నటిస్తున్నానని చెప్పింది.
పెళ్ళికి ముందురోజు బాయ్‌ఫ్రెండ్స్‌తో..
'ది హాలిడే' కథలో భాగంగా ఈ మెహెక్ అనే అమ్మాయి తన పెళ్ళికి ముందురోజు ముగ్గురు చిన్నప్పటి బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుంటుందట. అలాగే పగలు, రాత్రి రోజంతా హాలిడే ట్రిప్ బాగా ఎంజాయ్ వేస్తుందట. ఈ సన్నివేశాలే 'ది హాలిడే' వెబ్ సీరీస్‌లో బాగా హైలైట్ అయ్యే అంశాలని చెప్పుకొచ్చింది ఆదా శర్మ. వెబ్ సిరీస్ అయినప్పటికీ ఆదా శర్మ చెప్పిన ఈ సంగతులు దానిపై ఆసక్తి రేపుతున్నాయి.
గతంలో కియారా హల్చల్.. ఇప్పుడు ఆదా వంతా?
బోల్డ్ బ్యూటీ ఇంత ఓపెన్‌గా చెబుతోందంటే.. ఆ పాత్రలో ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది. గతంలో ఇలాగే వెబ్ సిరీస్ లో హాట్ బ్యూటీ కియారా చేసిన క్యారెక్టర్ ఎంత హైలైట్ అయ్యిందో తెలిసిందే. స్వయం తృప్తి పొందే గృహిణిగా లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌తో హల్చల్ చేసింది కియారా. ఈ లెక్కన ఆదా చెబుతున్న విషయాలను బట్టి 'ది హాలిడే' ద్వారా ఆదా వంతు వచ్చేసిందేమో అనిపిస్తోంది. చూద్దాం మరి రిలీజ్ కాగానే తెలుస్తుందిగా!.
కెరీర్లో టర్నింగ్
టాలీవుడ్ సినిమాల పరంగా 'సన్నాఫ్ సత్యమూర్తి' తర్వాత అదా శర్మ సరైన అవకాశాలు దక్కించుకోలేక పోయింది. చాలా కాలం తర్వాత రాజశేఖర్ సరసన `కల్కి` చిత్రంలో నటించింది. ఇందులో అదా గ్లామర్ యాంగిల్‌ని బాగా ఎలివేట్ చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. కాకపోతే తెలుగులో తన కెరీర్ మళ్ళీ టర్నింగ్ తీసుకుంటుందని స్ట్రాంగ్‌గా చెబుతోంది ఆదా.