అవకాశాల కోసం సెక్సువల్ ఫేవర్ చేస్తారు.. వాళ్ళ ఇష్టం, కానీ!
చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంశం ఇప్పుడు మాట్లాడుకునేంత కొత్తదేం కాదని హీరోయిన్ ఆదా శర్మ తెలిపింది. టాలీవుడ్ లో ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ అంశం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
అవకాశాల కోసం కొందరు శారీరక సుఖం అందించడానికి కొందరు నటీమణులు వెనుకాడడం లేదని అదాశర్మ అభిప్రాయ పడింది. అది వారి వ్యక్తిగత విషయం అని అభిప్రాయ పడింది. కానీ అవకాశాల పేరుతో వేధించినా, వత్తిడి చేసినా నేరం అవుతుందని అదా శర్మ తెలిపింది.

తనకు మాత్రం ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదని అదాశర్మ తెలిపింది. అదాశర్మ నితిన్ హార్ట్ అటాక్ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆ తరువాత ఆమె సన్ ఆఫ్ సత్యమూర్తి, క్షణం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. సౌత్ లో అవకాలు దక్కించుకోవడం సులువని, కానీ బాలీవడో లో అంత తొందరగా ఛాన్సులు రావాలని ఓ ఇంటర్వ్యూ లో తెలిపింది.


Click it and Unblock the Notifications











