Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అలా పడుకోవాలి.. అదా శర్మ వీడియో వైరల్
పూరి జగన్నాద్ పరిచయం చేసిన హీరోయిన్స్‌లో కచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. పూరి డైరెక్షన్లో చేసిన అమ్మాయి ఫేమస్ అవుతుంది. పూరి హీరోయిన్ అనే ఓ బ్రాండ్ టాలీవుడ్లో ఇప్పటికీ ఉంది. అలాంటి పూరి పరిచయం చేసిన ఓ ముద్దు గుమ్మే అదా శర్మ. హార్ట్ ఎటాక్ చిత్రంతో అందరికీ హార్ట్ ఎటాక్ తెప్పించింది. అయితే అటుపై సరైన అవకాశాలు రాకవపోవడంతో అంతగా ఫేమస్ కాలేకపోయింది. సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం లాంటి హిట్స్ ఉన్నా ఛాన్స్‌లు మాత్రం రావడం లేదు.
అందుకే ఈ భామ కేవలం వెండితెరనే నమ్ముకుని ఉండటం లేదు. సోషల్ మీడియాలో అదా చేసే ఫీట్స్, షేర్ చేసే ఫోటోలు, రెచ్చగొట్టేలా చేష్టలుంటాయి. హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారును ఫిదా చేసేస్తూ ఉంటుంది. వెరైటీ క్యాస్టూమ్స్, పేపర్స్ డ్రెస్, కలర్ కలర్ హెయిర్స్ ఇలా ఎన్నో రకాలు రెడీ అవుతూ ఉంటుంది. ఇక బికినీ ఫోటోల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు అప్పుడప్పుడు జిమ్నాస్టిక్ విన్యాసాలు కూడా చేస్తుంటుంది.
View this post on InstagramA post shared by Adah Sharma (@adah_ki_adah) on
ఆ మధ్య అదా శర్మ, అదా శర్మ తల్లి తాడుతో చేసిన జిమ్మాస్టిక్ ఓ రేంజ్లో వైరల్ అయింది. తాజాగా మరో వీడియోను షేర్ చేసింది ఆదా శర్మ. ఎలా పడుకోవాలో నేర్పించింది. రాత్రిపూట ఎలా నిద్రపోవాలనే విషయాన్ని ఆమె సరదాగా చెప్పింది. నేలపై కాకుండా గాలిలో తాడు సాయంతో నిద్రపోయే భంగిమలో ఆమె ఈ విషయాన్ని చేసి చూపింది. తాను రాత్రి పూట ఇలాగే నిద్రిస్తానని చెబుతూ.. టిక్‌టాక్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.