రుద్దు రుద్దు అంటూ...సోప్ యాడ్లో హీరోయిన్ ప్రచారం
హైదరాబాద్: హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భామ ఆదా శర్మ. సినిమాల్లోకి రాక ముందు నుండే ఆదా శర్మ పలు కార్పొరేట్ సంస్థల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేసింది. తాజాగా ఆమె మరో బ్రాండ్‌కు సైన్ చేసింది. గోద్రెజ్ నెం.1 బ్యూటీ సోప్ తరుపున ఆమె ఇకపై ప్రచారం చేయనుంది.
హిందీ, తమిళం, తెలుగు వెర్షన్లలో ఆమెతో ఈ యాడ్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నారు. గోద్రెజ్ నెం.1 బ్యూటీ సోప్ మీ బాడీకి రుద్దితే....నాలా అందంగా తయారవుతారు అంటూ ఆదా శర్మ ప్రచారం చేయబోతోంది. ఆదా శర్మ లాంటి అందమైన భామతో తమ సంస్థ తయారు చేస్తున్న సబ్బులను ప్రమోట్ చేయడం ద్వారా అమ్మకాలు పెరుగుతాయని గోద్రెజ్ సంస్థ భావిస్తోంది.
ఆదా శర్మ కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో జన్మించింది. ఆమె తండ్రి మర్చంట్ నేవీ కెప్టెన్. మోడలింగుపై ఆసక్తితో అటు వైపు అడుగులు వేసిన ఆదా శర్మ సక్సెస్‌ఫుల్ దూసుకెలుతోంది.

గోద్రెజ్ యాడ్లో అదా శర్మ
మోడల్‌గా సక్సెస్‌ఫుల్‌గా దూసుకెలుతున్న అదా శర్మ పలు కమర్షియల్ యాడ్స్‌లో నటించింది. తాజా ఆమె గోద్రెజ్ నెం.1 బ్యూటీ సోపుకు ప్రచార కర్తగా మారింది.

జోయ్ అలుకాస్ యాడ్
2011లో అదా శర్మ జోయ్ అలుకాస్ సంస్థ తరుపున బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేసింది.

అదా శర్మ, మాధవన్
జోయ్ అలుకాస్ యాడ్లో మాధవన్, అదా శర్మ కలిసినటించారు.

పెటా యాడ్లో అదా శర్మ
పెటా సంస్థ తరుపున కూడా అదా శర్మ ప్రచారం చేసింది. పక్షులను పంజరాల్లో ఉంచొద్దు, వాటిని స్వేచ్ఛగా ఎగరనివ్వండి అంటూ ఆమె ప్రచారం చేసింది.

నోకియా యాడ్లో...
నోకియా మొబైల్ ఫోన్ల తరుపున ప్రచారం చేసిన అదా శర్మ ...అందుకు సంబంధించిన ప్రకటనల్లో బాలీవుడ్ నటుడు శర్మాన్ జోషితో కలిసి పని చేసింది.

పారాచూట్ యాడ్
పారాచూట్ హెయిర్ ఆయిల్ యాడ్లో కూడా అదా శర్మ నటించింది.

ఓలే యాడ్లో...
ఓలే నాచురల్ వైట్ ఫేస్ క్రీం యాడ్లో కూడా అదా శర్మ నటించింది.

లిమ్కా యాడ్
లిమ్కా సాఫ్ట్ డ్రింక్ యాడ్లో కూడా ఆదా వర్మ నటించింది.


Click it and Unblock the Notifications











