'గోవిందుడు అందరివాడేలే' విలన్ కి వింత కోరికలు

By Srikanya

హైదరాబాద్ : రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కాజల్‌ హీరోయిన్. ప్రకాష్‌రాజ్‌, శ్రీకాంత్‌, కమలినీ ముఖర్జీ ముఖ్య పాత్రధారులగా చేస్తున్న ఈ చిత్రంలో విలన్ గా...ఆదర్శ్ బాలకృష్ణ చేస్తున్నారు. ఇక్భాల్ చిత్రంతో పరిచయమైన తర్వాత హ్యాపీ డైస్, రైడ్, వినాయకుడు, ఎవరైనా ఎప్పుడైనా, అప్పలరాజు వంటి చిత్రాలు వరసగా చేసినా అతనికి బ్రేక్ రాలేదు. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో చేస్తూండటంతో ఖచ్చితంగా బ్రేక్ వస్తుందని భావిస్తున్నాడు.

ఆదర్శ్ మాట్లాడుతూ.... " విలన్ గా నన్ను ఎంత ద్వేషిస్తే... నేను అంత సక్సెస్ అయినట్లు. ఈ సినిమా విడుదల అయ్యాక నన్ను చాలా మంది తిట్టుకుంటారు...ద్వేషిస్తారు అలాంటి క్యారక్టరైజేషన్ త కృష్ణవంశీ గారు తీర్చి దిద్దుతున్నారు..ఈ చిత్రం చూసి నా ఇంటిమీద జనం రాళ్లు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా చేస్తే నేను నా జాబ్ ని సమర్ధంగా చేసినట్లు భావిస్తాను ," అని అన్నారు.

సినిమా చిత్రీకరణ కేరళలోని పొల్లాచ్చిలో జరుగుతోంది. చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెల నాలుగు వరకు అక్కడే చిత్రీకరణ ఉంటుంది.కృష్ణవంశీ దర్శకుడు. బండ్ల గణేష్‌ నిర్మాత.

Adarsh Balakrishna Playing Baddie In Govindudu Andarivadele

''తెలుగు సంప్రదాయాలు, కుటుంబ సంబంధాల విలువను చూపించేలా ఉంటుందీ చిత్రం. రామ్‌చరణ్‌, కాజల్‌ మధ్య నడిచే సరదా సన్నివేశాలు ప్రేక్షకులకు చక్కటి అనుభూతినిస్తాయి. ప్రకాష్‌రాజ్‌ పాత్ర అతని కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది'' అంటున్నారు దర్శకనుడు. ఈ చిత్రానికి హారిస్‌ జైరాజ్‌ సంగీతమందిస్తున్నారు. ఇటీవల ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ప్రకాష్‌రాజ్‌ ''ఈ చిత్రబృందంతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. కృష్ణవంశీ, రామ్‌చరణ్‌.. ఇలా అందరూ నాలో పాజిటివ్‌ ఎనర్జీని నింపారు'' అంటూ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.

శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X