ఆమెపై క్రష్, రాజమౌళితో ఛాన్స్, మహేష్ నిర్మించడం నా అదృష్టం: అడవి శేష్

ఒకప్పుడు అడవి శేష్ అంటే చాలా మందికి తెలియక పోవచ్చు. అలాంటి పరిస్థితి నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే స్థాయికి ఎదిగాడు ఈ యంగ్ హీరో. 'క్షణం' మూవీతో సోలో హీరోగా తొలి విజయం అందుకున్న శేష్... 'గూఢచారి', 'ఎవరు' ఇలా వరుస హిట్లు కొడుతూ మినిమమ్ గ్యారంటీ స్టార్‌గా పాపులర్ అయ్యారు. 'ఎవరు' తర్వాత శేష్‌తో సినిమాలు చేయడానికి చాలా మంది నిర్మాతలు పోటీ పడుతున్నారంటే అతడికి డిమాండ్ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీతో ఆయనకు అభిమానులు కూడా పెరిగారు. తాజాగా ఫ్యాన్స్‌తో ట్విట్టర్ చాట్ చేసిన శేష్ వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

మీరు సినిమాల్లోకి రావడానికి ప్రేరణ ఎవరు?

మీరు సినిమాల్లోకి రావడానికి ప్రేరణ ఎవరు?

మీరు సినిమాల్లోకి రావడానికి ప్రేరణ ఏ సినిమా? ఏ పాత్ర? అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అడవి శేష్ రియాక్ట్ అవుతూ... ‘రంగీలా' మూవీలో అమీర్ ఖాన్ పాత్ర అంటూ సమాధానం ఇచ్చారు.

ఆమెపై నాకు క్రష్ ఉంది

ఆమెపై నాకు క్రష్ ఉంది

బాలీవుడ్ నటీమణుల్లో మీకు ఎవరిపై క్రష్ ఉంది అనే ప్రశ్నకు స్పందిస్తూ... ‘లీసా హెడెన్' అని సమాధానం ఇచ్చారు. లీసా హెడెన్ తెలుగు మూవీ ‘రచ్చ'లో అతిథి పాత్ర చేసిన సంగతి తెలిసిందే.

మహేష్ బాబు ఆ మూవీలో కేక

మహేష్ బాబు ఆ మూవీలో కేక

మహేష్ బాబు సినిమాల్లో మీకు ఇష్టమైనవి ఏమిటి? అనే ప్రశ్నకు ‘మురారి', ‘ఒక్కడు', ‘అతడు' అని సమాధానం ఇచ్చారు. అయితే ‘ఖలేజా' చిత్రంలో ఆయన పెర్పార్మెన్స్ బాగా నచ్చింది అంటూ శేష్ వెల్లడించడం గమనార్హం. ఖలేజా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైన సంగతి తెలిసిందే.

ఫేవరెట్ హీరో

ఫేవరెట్ హీరో

చిన్నతనంలో నాగార్జున అభిమానిని... కానీ నా బెస్ట్ చైల్డ్ హుడ్ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి', ‘హలో బ్రదర్' అని శేష్ చెప్పుకొచ్చారు. ఇలా చెప్పడం ద్వారా తనకు చిరంజీవి, నాగార్జున ఇద్దరూ ఇష్టమే అనే చెప్పే ప్రయత్నం చేశారు శేష్.

తొలిప్రేమ టాప్ 10 మూవీ

తొలిప్రేమ టాప్ 10 మూవీ

పవన్ కళ్యాణ్ చిత్రాల్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏమిటి? అనే ప్రశ్నకు రియాక్ట్ అవుతూ..... ‘తొలి ప్రేమ' నా ఆల్ టైమ్ టాప్ 10 ఫేవరెట్ చిత్రాల్లో ఒకటి అని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘పంజా' మూవీలో అడవిశేష్ నెగెటివ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే.

రాజమౌళి సినిమాలో ఛాన్స్ వస్తే

రాజమౌళి సినిమాలో ఛాన్స్ వస్తే

రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వస్తే ఎలా ఫీలవుతారు? అనే ప్రశ్నకు అడవి శేష్ రియాక్ట్ అవుతూ... నా జీవితంలో అతిపెద్ద కల నిజమైనట్లు భావిస్తాను అంటూ సమాధానం ఇచ్చారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 చిత్రంలో అడవిశేష్ నెగెటివ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే.

మహేష్ బాబు నిర్మించడం నా అదృష్టం

మహేష్ బాబు నిర్మించడం నా అదృష్టం

తన తర్వాతి సినిమా ‘మేజర్' షూటింగ్ తర్వలో ప్రారంభం అవుతుంది, వచ్చే ఏడాది ఇది ప్రేక్షకుల ముందుకు వస్తుంది, ‘మేజర్' మూవీ తర్వాత ‘గూఢచారి 2' చిత్రం మొదలు పెడతామని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు శేష్ రిప్లై ఇచ్చారు. ‘మేజర్' చిత్రాన్ని మహేష్ బాబు తన సొంత బేనర్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి అవకాశం దక్కడం తన అదృష్టంగా శేష్ చెప్పుకొచ్చారు.

‘2 స్టేట్స్' రీమేక్ ఆగిపోయింది

‘2 స్టేట్స్' రీమేక్ ఆగిపోయింది

అడవి శేష్, రాజశేఖర్ కూతురు శివాని జంటగా ఆ మధ్య హిందీ హిట్ ‘2 స్టేట్స్' తెలుగు రీమేక్ మొదలైంది. అయితే తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ మూవీ ఆగిపోయినట్లు అడవి శేష్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X