Don't Miss!
- News ఎన్నికల వేళ రేవంత్ కీలక నిర్ణయం - నేరుగా రంగంలోకి..!!
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Sports CSK Playing XI: స్టార్ ప్లేయర్‌పై వేటు.. LSGతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology వన్‌ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్‌లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
50 శాతం కలెక్షన్లు ఉన్నాయంటే గొప్ప సంగతే
ప్రేక్షకులకి తెలిసిన ముఖాలేమీ లేకపోయినా 50 శాతం కలెక్షన్లు ఉన్నాయంటే గొప్ప సంగతే. డిస్ట్రిబ్యూటర్ కూడా 'బాగుంది' అంటున్నారు. రానున్న రోజుల్లో కలెక్షన్లు పెరుగుతాయని అనుకుంటున్నా అంటున్నారు 'కర్మ' చిత్రం హీరో కమ్ డైరక్టర్ అయిన అడివి శేష్. వినాయకుడు దర్శకుడు అడవి సాయికిరణ్ అయిన శేషు రూపొందించిన 'కర్మ' చిత్రం క్రితం శుక్రవారం విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రం గురించి చెప్పటానికి అడి శేషు మీడియాను నిన్న(సోమవారం)కలిసి మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. అలాగే ఈ చిత్రాన్ని ఆయన ప్రయోగంగా అభివర్ణిస్తున్నారు..అదే చెప్తూ..ఇది ప్రయోగమనే అంటా. ఎందుకంటే ఇందులో నేను చూపించిన కథనం తెలుగువాళ్లకి కొత్త. సహజ కథన పద్ధతిలో దీన్ని తీశా. ప్రేక్షకులకి థ్రిల్లర్ ఫీల్ కలుగుతుంది. చివరలో ఊహించని మలుపు ఉంటుంది. ప్రేక్షకుల్లో 75 శాతం మందికి ఈ సినిమా నచ్చుతోంది. మిగతావాళ్లు కూడా దీన్ని బాగోలేదని చెప్పడం లేదు. ఎప్పడూ ఇట్లాంటి సినిమాని చూడలేదని అంటున్నారు. ప్రతి ఫ్రేములోనూ ఆ కొత్తదనం కనిపిస్తుంది. గ్రాఫిక్స్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయంటున్నారు.'తెలుగులో ఉన్న అమెరికన్ సినిమా' అంటున్నారు. అమెరికాలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో విడుదల చేశా. అక్కడ తెలుగువాళ్ల కంటే హిందీతో పాటు ఇతర భాషలవాళ్లు ఎక్కువగా చూస్తున్నారు. 'చాలా బోల్డ్ అంటెప్ట్' అనే టాక్ వచ్చింది అన్నారు.