సాఫ్ట్‌గా కనిపించి..నైసుగా కోసేస్తా:‘పంజా’విలన్
''సాఫ్ట్‌గా కనిపించి..నైసుగా కోసేస్తా.. విలక్షణ విలనీ చేస్తాను. పైకి కనిపించేట్టు కాకుండా దానికి పూర్తి భిన్నమైన పాత్ర ఇది.'చేస్తే ఇలాంటి పాత్రలోనే చేయాలి" అన్నంత మంచి అవకాశం 'పంజా"తో వచ్చింది. పవన్ హీరోగా నటించిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో ఓ విలక్షణ పాత్రలో నటించినందుకు ఆనందంగా ఉంది. నా పాత్ర విషయానికొస్తే..నేనో క్రేజీ ఫెలోని. అవతలివారికి నా వల్ల ఎప్పుడూ ప్రమాదమే."" అన్నారు.
దర్శకుడి గురించి మాట్లాడుతూ 'విష్ణు..ప్రతి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. నా పాత్రను తనే స్వయంగా నటించి మరీ చూపించారు. దాంతో నా పని చాలా సులువైంది. నేను జాకీ ష్రాప్‌తో ఎక్కువ సన్నివేశాల్లో కనిపిస్తాను. పవన్‌తో, అంజలి లావాణియాతో కీలక సన్నివేశాల్లో కనిపిస్తా. ఓ భారీ యాక్షన్ సీన్‌లోనూ నటించాను అన్నారు. పంజాలో అడవి శేషు పాత్ర చాలా స్టైలిష్ గా సాగే నెగిటివ్ రోల్ అని చెప్పుకుంటున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం పంజా ఆడియో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. పవన్ అభిమానులంతా ఈ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ట్రైలర్స్, ఫస్ట్ లుక్ అంతటా ఓ రేంజిలో ఇంట్రస్టుని క్రియేట్ చేసింది. సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా సంస్థలు సంయుక్తంగా పంజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సారాజేన్ డైస్, అంజని లావని హీరోయిన్స్ గా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తమిళంలో భిళ్లా చిత్రం రూపొందించిన విష్ణువర్థన్ దర్శకుడు. కోల్‌కతా నేపథ్యంలో జరిగే కథ ఇది. అక్కడే చాలా భాగం షూటింగ్ చేసారు. ఈ చిత్రంలో పవన్ పాత్ర చిత్రణ, వేషధారణ కొత్త పంథాలో ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్, సంగీతం: యువన్ శంకర్‌రాజా.


Click it and Unblock the Notifications











