కాలు బెణికినా పవన్ పరుగులు
సినిమా షూటింగ్ సమయంలో కాలు బెణికి కదపడానికి కష్టంగా ఉన్నప్పటికీ పరుగులు తీసే సన్నివేశాలు చేశారు పవన్ కల్యాణ్. ఆ విషయం విన్నప్పటి నుంచి వృత్తిపట్ల ఆయనకున్న అంకితభావం నచ్చింది. దాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాను అంటున్నారు పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'పంజా'లో విలన్ గా చేస్తున్న అడవి శేషు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...పవన్‌కల్యాణ్‌గారితో నటించాలి అనుకున్నప్పుడే టెన్షన్ మొదలైంది. తొలిరోజు సెట్‌లో కలుసుకున్నప్పుడు 'వేర్ ఆర్ యు ఫ్రమ్' అన్నారు. తెలుగువాడినే అనేసరికి సరదాగా మాట్లాడారు. హీరోగారు చాలా కూల్ మనిషి. ఫ్రెండ్లీగా ప్రవర్తించారు. ఆయన నాకు ఇచ్చిన సలహాలు ఎంతో విలువైనవి అన్నారు.
కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవలే విడుదల చేసిన పవన్‌కళ్యాణ్ స్టిల్స్‌కి అపూర్వమైన స్పందన వస్తోంది. ఇందులో ఆయన గెటప్ ఎంత కొత్తగా ఉందో... పాత్ర చిత్రణ కూడా అంత కొత్తగా ఉంటుంది. స్టయిలిష్ డెరైక్టర్ విష్ణువర్థన్ ఈ సినిమాను న్యూలుక్‌తో ప్రెజెంట్ చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. యువన్‌శంకర్‌రాజా సంగీతం కూడా ఈ సినిమాకు ఎస్సెట్. ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు:అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్ బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్:అనూవర్థన్.


Click it and Unblock the Notifications











