సందడి లేకుండానే...బాలయ్య‘అధినాయకుడు’ ఆడియో
నందమూరి బాలకృష్ణ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'అధినాయకుడు'. లక్షీరాయ్, సలోని ఇందులో కథానాయికలు. పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్. కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత కుమార్ చౌదరి మాట్లాడుతూ....''ఈ నెల 8న ఆడియోను డైరెక్టుగా మార్కెట్ లోకి ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల చేయబోతున్నాం. పాటలు ఎక్స్‌ట్రార్టినరీగా వచ్చాయి. బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా కళ్యాణిమాలిక్ అద్భుతంగా స్వరాలందించారు. ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోంది'' అని తెలిపారు.
దర్శకుడు పరుచూరి మురళి మాట్లాడుతూ ''బాలకృష్ణ ఇమేజ్ ను, బాడీలాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన కథ ఇది. ఆయన అభిమానులను రంజింపచేసే అన్ని అంశాలకు ఇందులో పెద్ద పీట వేస్తున్నాం. బాలయ్య నటన, యాక్షన్ ఎపిసోడ్స్, సెంటిమెంట్ సీన్స్, వినోదం, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తాయి'' అని చెప్పారు. జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్ రాజ్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, ఆదిత్య మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరాa: సురేందర్ రెడ్డి, సంగీతం: కళ్యాణి మాలిక్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.


Click it and Unblock the Notifications











