పాలిటిక్స్ ని ఏకుతూ బాలకృష్ణ
బాలకృష్ణ తాజా చిత్రం అధినాయకుడులో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటున్న రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య సంఘటనలు చోటు చేసుకోనున్నాయని సమాచారం. ఈ విషయం మీడియాలో ప్రచారం అవుతోంది. దీనిపై ఓ లీడింగ్ ఇంగ్లీష్ డైలీ నిర్మాత ఎమ్.ఎల్ కుమార్ చౌదరిని కలిసి ప్రశ్నించటం జరిగింది. అయితే ఆయన ఇందులో అటువంటి సంఘటనలు ఉన్నాయని అనలేదు.. లేవని ఖండించలేదు.. మీరు రేపు తెరపైన చూస్తేనే బెస్ట్ అని చెప్పారు. ఇక ఇందులో బాలకృష్ణ మూడు పాత్రల్లో కనిపించనున్నారు. పెద్దాయన పాత్ర రాష్ట్ర రాజకీయాలను ఏకుతూ సాగుతుందని చెప్తున్నారు.
ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ గురించి దర్శకుడు మాట్లాడుతూ... నా యకత్వం వ్యాపారం కాదు... వారసత్వంగా రావటానికి. వెనకనున్న పదిమంది ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చాలి. అప్పుడే నాయకుడు అవుతాడు. అలాంటివాళ్లు మాత్రమే ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకొంటారు. తరతరాలుగా ప్రజాసేవకు అంకితమై నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకొన్న ఓ కుటుంబం కథే మా చిత్రం అంటున్నారు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తుండటం విశేషం. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎమ్.ఎల్ కుమార్‌చౌదరి నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆరు పాటలు సహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.


Click it and Unblock the Notifications











