‘అధినాయకుడు’లో విగ్రహాల డైలాగ్ పెట్టడాని కారణం ఇదే...
'అధినాయకుడు' చిత్రం విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్‌లో 'మంచి నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలేగానీ...రోడ్డుమీద విగ్రహాల్లో కాదు. ఈ విగ్రహాల రాజకీయం ఎందుకు చేస్తున్నావో చెబుతావా, చెప్పించమంటావా' అనే డైలాగ్ ఉంది. ఈ డైలాగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ను టార్గెట్ చేస్తున్నట్లు ఉండటంతో ఆ పార్టీ వారు సినిమాను ఉప ఎన్నికలు ముగిసే వరకు వాయిదా వేయాలని ఫిర్యాదు చేశారు కూడా.
అసలు ఈ డైలాగ్ ఎందుకు పెట్టారంటే...
హరిశ్చంద్ర ప్రసాద్(వృద్ధ గెటప్ బాలయ్య) లాంటి మంచి నాయకుడు చనిపోవడంతో అతిని విగ్రహం కర్నూలు నడి ఒడ్డున పెట్టేందుకు మా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అంటూ విలన్ కోట వచ్చి చెబుతాడు. కోట ఈ విగ్రహం పెట్టే ప్లాన్ ఎందుకు వేస్తాడంటే అతని మనుషులను మచ్చిక చేసుకోవడానికి. ఇది నచ్చని రామకృష్ణ ప్రసాద్......'మంచి నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలేగానీ...రోడ్డుమీద విగ్రహాల్లో కాదు. ఈ విగ్రహాల రాజకీయం ఎందుకు చేస్తున్నావో చెబుతావా, చెప్పించమంటావా' అడే డైలాగ్ కొడతాడు.
పరుచూరి మురళి దర్శకత్వం వహించిన 'అధినాయకుడు' చిత్రాన్ని ఎంఎల్ కుమార్ చౌదరి కీర్తి కంబైన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది. బాలయ్య ఈ చిత్రంలో మూడు గెటప్స్ పోషించారు. హరిశ్చంద్ర ప్రసాద్ పాత్రలో అదగరొట్టగా...రామకృష్ణ ప్రసాద్ గెటప్ అతుకుల గడ్డం సెట్ కాలేదు. కిల్లర్ కిట్టుగా బాలయ్య చేసే డాన్సులు భరించడం కాస్త కష్టమే.
బాలయ్య సరసన లక్ష్మిరాయ్ మెయిన్ హీరోయిన్‌గా నటించింది. లక్ష్మిరాయ్ ఓ పాటలో గెస్ట్‌రోల్లో తళుక్కుమంది. ఈ చిత్రానికి కథ: పరుచూరి మురళి, సంగీతం: కళ్యాణి మాలిక్, సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు.


Click it and Unblock the Notifications











