బాలయ్య ‘అధినాయకుడు’కి జగన్ అరెస్టు సెగ..?
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 'అధినాయకుడు' చిత్రం గత ఐదు నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తూ....చివరకు జూన్ 1న రిలీజ్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాతలు కూడా పత్రికా ప్రకటన ద్వారా రిలీజ్ విషయాన్ని స్పష్టం చేశారు.
అయితే 'అధినాయకుడు' చిత్రానికి వైఎస్ జగన్ అరెస్టు సెగ తాకే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఈ చిత్రంలో బాలయ్య చెప్పిన కొన్ని డైలాగులు జగన్‌ను టార్గెట్ చేస్తున్నట్లు ఉండటమే. ''మంచి నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలే గానీ, రోడ్డమీద బొమ్మల్లో కాదు...ఉన్నట్టుండి ఈ విగ్రహాల రాజకీయం ఎందుకు మొదలు పెట్టావో చెబుతావా? చెప్పించమంటావా?'' అంటూ బాలయ్య చెప్పిన డైలాగు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.
ఈ డైలాగులో బాలయ్య ఎక్కడ కూడా జగన్ పేరు ప్రస్తావించక పోయినప్పటికీ....అది జగన్‌ను టార్గెట్ చేస్తూ ఉందనేది కాదనలేని సత్యం. కాగా జగన్ అరెస్టుతో ఇప్పటికే ఆగ్రహం గాఉన్న వైఎస్ఆర్‌సి కాంగ్రెస్ నేతలు...సినిమా విడుదల సమయంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. చిరంజీవిపై కూడా ఈ చిత్రంలో సెటైర్లు ఉన్నాయని తెలుస్తోంది.
బాలయ్య తొలిసారిగా ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నా. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ బాలయ్య మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్, నిర్మాత: ఎం.ఎల్. కుమార్ చౌదరి, దర్శకత్వం: పరుచూరి మురళి.


Click it and Unblock the Notifications











