'అధినాయకుడు' టార్గెట్ ఆ పార్టీనా?
బాలకృష్ణ తాజా చిత్రం 'అధినాయకుడు'చిత్రం మహాశివరాత్రి సందర్భంగా విడుదల అవుతోంది. ఈ చిత్రం ప్రస్తుత రాజకీయాలను విశ్లేషిస్తూ రూపొందించారనే సంగతి తెలిసిందే. మరో ప్రక్క బాలకృష్ణ సైతం ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి దూకుతానంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఏ పొలిటికల్ పార్టీని టార్గెట్ చేస్తోంది అనేది ఇప్పుడు చర్చగా మారింది. ఎందుకంటే ఈ చిత్రం గురించి చెపుతూ దర్శకుడు పరుచూరి మురళి.. ఎక్కడో ఎవరో నిర్ణయాలు తీసుకోవాలి. అవి ఆచరణలోకి రావాలి. ఆ తరవాతే జనం సమస్యలు తీరాలి... ఈ విధానానికి తిలోదకాలు ఇవ్వాలన్నది ఆ పెద్దాయన సిద్ధాంతం. సమస్య మనదే అయినప్పుడు, దాన్ని పరిష్కరించుకొనే అధికారం కూడా మనదే కావాలంటాడు.
ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించే ఆయన ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? తన సిద్ధాంతాలతో ప్రజల్ని ఎలా చైతన్యం చేశాడన్నది తెర మీదే చూడమంటున్నారు. ఇది విన్నవారికి బాలకృష్ణ ఏ పార్టీని లక్ష్యంగా పెట్టుకుని చిత్రం రూపొందించారనేది స్పష్టంగా అర్దం అవుతుందని చెప్తున్నారు. ఇక 'అధినాయకుడు'లో నందమూరి బాలకృష్ణ మూడు పాత్రల్లో కనిపిస్తారు. లక్ష్మీరాయ్, సలోనీ హీరోయిన్స్ . మహాశివరాత్రికి చిత్రాన్ని విడుదల చేస్తారు. నిర్మాత ఎమ్.ఎల్.పద్మకుమార్ చౌదరి మాట్లాడుతూ ''రాజకీయం, కుటుంబ అనుబంధాలు కలగలిసిన కథ ఇది. బాలకృష్ణ నటనే ఈ చిత్రానికి ప్రధాన బలం. మూడు తరాల్ని ప్రతిబింబించే పాత్రల్ని ఆయన సమర్థంగా పోషించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు నడుస్తున్నాయి. త్వరలో పాటల్ని విడుదల చేస్తామ''న్నారు. సంగీతం: కల్యాణిమాలిక్.


Click it and Unblock the Notifications











