పాలించేది బాలయ్యే...కొత్త గెటప్ అదిరింది
నందమూరి నట సింహం బాలకృష్ణ 'అధినాయకుడు'గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన కొత్త స్టిల్ ఒకటి విడుదలైంది. 'హి రూల్స్'(అతడు పాలిస్తాడు) అనే క్యాప్సన్‌తో ఈ కొత్త వాల్ పోస్టర్ సినిమాపై అంచనాలు మరింత పెంచుతోంది.
బాలయ్య ఈ గెటప్‌లో కొత్తగా, చాలా బాగున్నాడని నందమూరి అభిమానులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధినాయకుడు చిత్రంలో బాలయ్య తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. లక్షీరాయ్, సలోని ఇందులో కథానాయికలు. పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్. కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో ముసలి గెటప్‌లో ఉండే బాలయ్య పాత్ర...పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తుందని, ఆయనపై ఇండైరెక్టుగా రాజకీయ విమర్శలు చేస్తారని తెలుస్తోంది. ఆ మధ్య బాలయ్య మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి పదవుల కోసం ఢిల్లీ చుట్టు తిరుగుతున్నారని విమర్శించడం, చిరంజీవి స్పందిస్తూ బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం అంటూ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమా ద్వారా చిరుపై విమర్శల రివేంజ్ తీర్చుకుంటున్నారని అంటున్నారు.
జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ బాలయ్య మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్, నిర్మాత: ఎం.ఎల్. కుమార్ చౌదరి, దర్శకత్వం: పరుచూరి మురళి.


Click it and Unblock the Notifications











