సంక్రాంతి బరి నుంచి బాలయ్య ఔట్-జనవరి 25న విడుదల!
నందమూరి హీరో బాలకృష్ణ ఈ సంక్రాంతికి 'అధినాయకుడు'గా ప్రేక్షకుల ముందుకు వస్తాడని అభిమానులతో పాటు, అంతా బోలెడు ఆశతో ఎదురు చూస్తున్న తరుణంలో....అందరినీ నిరాశ పరుస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ సినిమా దర్శకత నిర్మాతలు. ఈ సినిమాను తొలుత సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా....కొన్ని కారణాల వల్ల 'అధినాయకుడు' జనవరి 25కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. అదే రోజు రవితేజ 'నిప్పు'తో పాటు ఇతర సినిమా విడుదవుతుండటంతో దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు.
'అధినాయకుడు' సినిమాలో బాలయ్య తొలిసారిగా తన సినీ కెరియర్ లో మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. సలోని, లక్ష్మిరాయ్ లీడ్ హరోయిన్లుగా నటిస్తుండగా, జయసుధ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ కు తగిన విధంగా ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎం.ఎల్. కుమార్ చౌదరి నిర్మాస్తున్నారు. కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారని అంటున్నారు యూనిట్ సభ్యులు. డిసెంబర్ 25న గ్రాండ్ గా ఆడియో వేడుక జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











