ఎట్టకేలకు ‘అధినాయకుడు’ విడుదల ఖరారు
దాదాపు సంక్రాంతి నుంచి వాయిదా పడుతూ వస్తున్న నందమూరి నట సింహం బాలయ్య నటించిన 'అధినాయకుడు' చిత్రం ఎట్టకేలకు విడుదల ఖరారైంది. ఈచిత్రాన్న జూన్ 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మే 31న ప్రీమియర్ షోలు వేయనున్నారు. యూఎస్‌లో ఈ చిత్రం ప్రదర్శన హక్కులు దక్కించుకున్న బ్లూస్కై సంస్థ ప్రెస్ నోట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
అధినాయకుడు చిత్రంలో బాలయ్య తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. లక్ష్మీ రాయ్, సలోని ఇందులో కథానాయికలు. పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్. కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో ముసలి గెటప్‌లో ఉండే బాలయ్య పాత్ర... పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తుందని, ఆయనపై ఇండైరెక్టుగా రాజకీయ విమర్శలు చేస్తారని తెలుస్తోంది. ఆ మధ్య బాలయ్య మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి పదవుల కోసం ఢిల్లీ చుట్టు తిరుగుతున్నారని విమర్శించడం, చిరంజీవి స్పందిస్తూ బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం అంటూ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమా ద్వారా చిరుపై విమర్శల రివేంజ్ తీర్చుకుంటున్నారని అంటున్నారు.
జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ బాలయ్య మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్, నిర్మాత: ఎం.ఎల్. కుమార్ చౌదరి, దర్శకత్వం: పరుచూరి మురళి.


Click it and Unblock the Notifications











