‘అధినాయకుడు’ లీగల్ వార్నింగ్
బాలకృష్ణ హీరోగా రూపొందిన 'అధినాయకుడు' చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా రిలీజ్ అయింది. చిత్రం పైరసీకి గురికాకుండా నిర్మాతలు ముందస్తుగా లీగల్ వార్నింగ్ జారీ చేశారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఎవరైనా ఈచిత్రాన్ని పైరసీ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే నిర్మాతల హెచ్చరికలు ఏ మేరకు ఫలిస్తాయనేదానిపై అభిమానుల్లో అనుమానాలు నెలకొన్నాయి. ఈ మధ్య రిలీజైన ప్రతి సినిమా విడుదలైన రెండు రోజులకే పైరసీ వెర్షన్ మార్కెట్లోకి వస్తోంది. ఇంటర్నెట్‌లోనూ అందుబాటులో ఉంటోంది. మరి దీన్ని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
'అధినాయకుడు' చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహించారు. ఎంఎల్ కుమార్ చౌదరి కీర్తి కంబైన్స్ బేర్‌పై ఈచిత్రాన్ని నిర్మించారు. బాలయ్య సరసన లక్ష్మిరాయ్ మెయిన్ హీరోయిన్‌గా నటించింది. సలోని ఓ పాటలో గెస్ట్‌గా తళుక్కుమంది. కళ్యాణి మాలక్ ఈచిత్రానికి సంగీతం అందించారు.
ఇక సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే.... జస్ట్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కేవలం అభిమానులకు మాత్రమే రుచించే మసాలా ఉందని, అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా ఆకట్టుకోలేక పోయింది. బి, సి సెంటర్లకు మాత్రమే పరిమితం అని రివ్యూ రిపోర్ట్స్ వచ్చాయి. ఇది ఓ రకంగా బాలయ్యకు, అభిమానులకు నిరాశ కలిగించే అంశమే.


Click it and Unblock the Notifications











