పరిటాల రవి గా తెలుగు కుర్రాడు..
రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న రక్త చరిత్ర చిత్రంలో ఆది పరిటాల రవి పాత్రను చేయనున్నరని సమాచారం. ఆది అంటే మరెవరో కాదు..ప్రముఖ దర్శకుడు రవి రాజాపినిశెట్టి కుమారుడు. అతని అసలు పేరు ప్రదీప్ పినిశెట్టి. ఇక హిందీలో ఈ పాత్రను వివేక్ ఒబరాయ్ చేయనున్నారు. తమిళ హీరో సూర్య కూడా మరో కీలకమైన పాత్రను చేయనున్నారనే సంగతి తెలిసిందే. ఇక ఆది తాజాగా శంకర్ నిర్మించిన సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈరమ్ చిత్రంలో చేసారు. అలాగే రెండు పార్టు లుగా రిలీజ్ కానున్న ఈ చిత్రం పరిటాల రవి నిజ జీవితాన్ని ఆధారం చేసుకుని వర్మ రూపొందిస్తున్నారు. అక్టోబర్ పది నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. హెదరాబాద్, అనంతపురం తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరపటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇక 'రక్తచరిత్ర' గురించి చిత్ర దర్శకుడప రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ "యదార్థ వ్యక్తులు, యదార్థ సంఘటనలతో కూర్చిన అత్యంత నిజమైన కల్పిత కథ ఇది. ఫ్యాక్షన్ నేపథ్యాన్ని వాస్తవ పరిస్థితుల్లో చూపిస్తున్నాం. ఇంతవరకూ ఎవరూ ఇలాంటి నేపథ్యాన్ని చూపించి ఉండరు. అందరూ కొత్తవాళ్లతో ఈ సినిమాకు శ్రీకారం చుడుతున్నామ"ని చెప్పారు. ఒన్‌మోర్ థాట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జెడ్ త్రీ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











