యుయస్ ఎ లో 'అదినువ్వే' సినిమా గురించి వివరములు..!
'అదినువ్వే' సినిమాను యు.యస్.ఎ విడుదల చేయడానికి అన్ని హక్కులను ప్రణీత్ మీడియా సోంతం చేసుకోని త్వరలో ఈ సినిమాను సెప్టెంబర్ 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని రామన్ సంచుల తెలియజేశారు.
'అదినువ్వే' సినిమాని యు.యస్.ఎ లో 'మిల్ పిటాస్' సిటిలో సిర్రా థియేటర్స్ లో సెప్టెంబర్ 17,18,19,20,21,22వ తారీఖులలో ఆడింటడం జరుగుతుందని ఎగ్టిబిటర్ 'బే ఏరియా హాట్ బ్రెడ్స్(408) 733-9171' వారు తెలిపారు. ఎవరైన ఆల్ లైన్ లో టిక్కెట్స్ బుక్ చేసుకోవాలంటే ఈ సైట్ Serratheaters.comలో చేసుకోవాల్సిందిగా వారు కోరారు.
అదేవిధంగా డల్లాస్ లో 'వాల్ నట్' థియేటర్స్ లో సెప్టెంబర్ 17,18,19,20,22వ తారీఖులలో ఆడింటడం జరుగుతుందని ఎగ్టిబిటర్ 'శ్రీనివాస్(918) 409-3472' వారు తెలిపారు. ఎవరైన ఆల్ లైన్ లో టిక్కెట్స్ బుక్ చేసుకోవాలంటే ఈ సైట్ walnuttheaters.comలో చేసుకోవాల్సిందిగా వారు కోరారు.
రోమాంటిక్ యూత్ అండ్ లవ్ స్టోరీతో నీలం వీరప్రసాద్ డైరెక్షన్ లో డా. శ్రీకాంత్ సమర్పణలో వందన ఆర్ట్స్ బ్యానర్ త్వరలో యు.యస్.ఎ లో విడుదలకు సిధ్దం గా ఉంది. 'అదినువ్వే' లో చైతన్య, అక్ష హీరో హిరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి జీవన్ థామస్ సంగీతం అందించారు. ఆడియోకి కూడా మంచి స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. సెన్సార్ బోర్డు నుండి క్లీన్ యు సర్టిఫికెట్ కూడా సాధించడం జరిగిందని అన్నారు. అన్ని కమర్షయల్ హాంగులతో ప్రేక్షకులముందుకు ఈ నెలలో రావడానికి సిధ్దంగా ఉందన్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే తన ప్రేమను తెలియజేయడంలో ఎప్పుడూ తికమక పడే ఒక యువకుడి కథ అని అన్నారు.


Click it and Unblock the Notifications











