యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ తాగితందనాలు ఆడినా,దుస్తులు విప్పుకు తిరిగినా మాకేం అభ్యంతరం లేదని పీసీసీ ప్రధాన కార్యదర్శి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చెప్పారు. గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లోపే పవన్ వికృత చర్యలకు ప్రజలు గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. రాష్టంలో ప్రజారాజ్యం పార్టీ ప్రభావం నామమాత్రమేనన్నారు. కేవలం సినీ గ్లామర్ పై ఉన్న అభిమానంతోనే చిరంజీవి రోడ్ షో లకు ప్రజలు వస్తున్నారన్నారు.రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రేస్, తెలుగుదేశం పార్టీల మధ్యే ప్ధాన పోటీ ఉంటుందన్నారు. మహేష్ బాబును ప్రచారం కోసం పార్టీ పిలవలేని,అతని సేవలు అవసరమని భావిస్తే ఆలోచిస్తామన్నారు.
Story first published: Monday, February 16, 2009, 14:50 [IST]