Adipurush: మరో వివాదంలో ఆదిపురుష్.. తిరుమల కొండపై హీరోయిన్‌కు ముద్దు.. వాళ్లిద్దరిపై విమర్శలు

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. కొంత కాలంగా దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోన్న పేరిది. అంతలా అతడు పాన్ ఇండియా చిత్రాలతో అన్ని ఇండస్ట్రీలపై దండయాత్ర చేస్తోన్నాడు. ఇలా ఇప్పటికే కొన్ని సినిమాలతో హవాను చూపించిన అతడు.. ఇప్పుడు 'ఆదిపురుష్' అనే సినిమాతో రాబోతున్నాడు.

మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మంగళవారమే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అది జరిగిన వెంటనే 'ఆదిపురుష్' మూవీ మరో వివాదంలో చిక్కుకుంది. అసలేం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

Adipurush Director Om Raut and Kriti Sanon Kiss Creates Controversy

ఆదిపురుష్‌ ఇలా వస్తున్నాడు: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా బడా డైరెక్టర్ ఓం రౌత్ రూపకల్పనలో వస్తున్న చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో రెబెల్ స్టార్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటించారు. కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడి పాత్రను చేశారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు.

Adipurush Director Om Raut and Kriti Sanon Kiss Creates Controversy

గ్రాండ్‌గా ఆదిపురుష్ ఈవెంట్: టెక్నికల్ వండర్‌గా భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'ఆదిపురుష్' మూవీని జూన్ 16వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను తిరుపతిలోని తారక రామ స్టేడియంలో నిర్వహించారు. దీనికి దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు వచ్చారు. ఫలితంగా ఇది గ్రాండ్ సక్సెస్ అయింది.

Adipurush Director Om Raut and Kriti Sanon Kiss Creates Controversy

శ్రీవారిని దర్శించున్నారుగా: మంగళవారం రాత్రి 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ మూవీ దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ అక్కడే బస చేశారు. ఇక, బుధవారం తెల్లవారుజామునే వీళ్లిద్దరూ వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. వీళ్లకు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు.

Adipurush Director Om Raut and Kriti Sanon Kiss Creates Controversy

మళ్లీ వివాదంలో ఆదిపురుష్: రామాయణం నేపథ్యంతో రూపొందిన 'ఆదిపురుష్' మూవీ ఆరంభంలోనే వివాదంలో చిక్కుకుంది. టీజర్ వదిలిన సమయంలో కొందరు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నానా రచ్చ చేశారు. అయితే, ఆ తర్వాత చిత్ర యూనిట్ అభ్యంతకరమైనవి తీసేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. దీని నుంచి తేరుకుంటోన్న సమయంలోనే 'ఆదిపురుష్' టీమ్ మరో వివాదంలో చిక్కుకుంది.

Adipurush Director Om Raut and Kriti Sanon Kiss Creates Controversy

హీరోయిన్‌కు డైరెక్టర్ ముద్దు: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్ బయటకు నడుచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆమె ఓ కారులో బయలుదేరేందుకు సిద్ధం అయింది. ఆ సమయంలోనే పక్కనే ఉన్న దర్శకుడు ఓం రౌత్‌కు హగ్ ఇచ్చింది. అప్పుడు ఆయన కృతి సనన్ బుగ్గపై ముద్దు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.

దేవుడి సన్నిధిలో ఆ పనులా?: కృతి సనన్‌కు ఓం రౌత్ ముద్దు పెట్టడం ఇప్పుడు వివాదంగా మారిపోయింది. ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండపై సినీ ప్రముఖులు ఇలాంటి పని చేయడంతో చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, తక్షణమే ఓం రౌత్, కృతి సనన్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని కొందరు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X