Adipurush Pre Review ఆదిపురుష్ బొమ్మ బ్లాక్ బస్టరా? సరికొత్త చరిత్ర కోసం ప్రభాస్ ఒక్క అడుగు..

ఆదిపురుష్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ నటించిన ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రీమియర్లు మొదలయ్యాయి. ఓం రావత్ దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మించిన ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ చరిత్ర సృష్టించేందుకు సిద్దమైంది. ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ తదితరులు సరికొత్ చరిత్రను సృష్టించేందుకు రెడీ అవుతున్నది. ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠను, ఉత్సాహాన్ని నింపిన ఈ సినిమా విశేషాల్లోకి వెళితే..

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాను సుమారు 500 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించారు. ఈ సినిమాను మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కించారు. అత్యాధునిక సాంకేతికతతో అద్బుతమైన దృశ్య కావ్యంగా తీర్చి దిద్దే ప్రయత్నం చేశారనే అభిప్రాయం టీజర్లు, ట్రైలర్లు కలిగించాయి.

Prabhas

ఆదిపురుష్ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ అవుతాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. రావణ సైన్యంతో వానర సేన జరిపే యుద్ద పోరాటలు తెర మీద అద్బుతంగా ఉంటాయని పేర్కొంటున్నారు. యుద్ధ సన్నివేశాలు సుమారు 40 నిమిషాలు కొత్త అనుభూతికి గురి చేస్తాయనే విషయాన్ని దర్శక, నిర్మాతలు స్పష్టం చేశాయి.

ఆదిపురుష్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సంగీత అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక అజయ్ అతుల్ సంగీతం అందించిన పాటలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలుగజేశాయి. రామ్ సీతా రామ్, శివోం శివ పాటలు అభిమానులను ఉత్తేజానికి గురిచేశాయి. మ్యూజిక్ పరంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

హిందీ ప్రాంతంలోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో ఆదిపురుష్‌ సినిమాకు అనూహ్యమైన స్పందన కలిపించింది. కన్నడ రాష్ట్రంలో అత్యధిక థియేటర్లలో రిలీజవుతున్న చిత్రంగా ఘనతను సాధించింది. ఈ చిత్రం ఇటీవల రిలీజైన పఠాన్ సినిమా ప్రదర్శించిన థియేటర్ల రికార్డును అధిగమించింది.

ఆదిపురుష్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 1100 వందలకు పైగా థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. తమిళనాడులో 170, కర్నాటకలో 180, కేరళలో 150, హిందీ ప్లస్ రెస్టాప్ ఇండియాలో 3300, ఓవర్సీస్‌లో 2100 థియేటర్లలో తీసుకు వస్తున్నారు. మొత్తంగా 7000 థియేటర్లలో రాబోతుంది.

ఇక అడ్వాన్స్ బుకింగ్ పరంగా ఆదిపురుష్ సినిమా సంచలనం రేపుతున్నది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల మేర వసూళ్లను సాధించింది. హిందీలో 13 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 50 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్‌కు చేరువైంది. అమెరికాలో ప్రీమియర్ల ద్వారా సుమారు 700K డాలర్లు రాబట్టింది. తొలి రోజు ఈ చిత్రం 100 నుంచి 150 కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X