Adipurush మూవీని నిషేధించండి.. అమిత్ షాకు ముఖ్యమంత్రి డిమాండ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంపై నిరసనల పర్వం కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు, వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రిక్వెస్ట్ చేయడం ఈ సినిమా మరోసారి మీడియాలో హైలెట్‌గా మారింది. ఆదిపురుష్ బ్యాన్ గురించిన విషయంలోకి వెళితే..
ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నారు. దుర్గ్ పట్టణంలో జరిగే భారీ పబ్లిక్ ర్యాలీలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన రాయ్‌పూర్‌కు చేరుకొన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్‌తో సమావేశమయ్యారు.

అమిత్ షా, భూపేష్ భాఘేల్ భేటీ సందర్భంగా వారిద్దరి మధ్య దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఆదిపురుష్ సినిమా గురించిన వివాదం చర్చకు వచ్చింది. ఈ సినిమాలో కొన్ని పాత్రల చిత్రీకరణ, వివాదాస్పద డైలాగ్స్ గురించి తన అభ్యంతరాన్ని సీఎం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయనే ఆందోళనను ఆయన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
అమిత్ షా పర్యటన సందర్భంగా భూపేష్ భాఘేల్ ట్వీట్ చేస్తూ.. ఛత్తీస్‌గఢ్ ప్రజలు, రామభక్తులు అమిత్ షాకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. రాముడు తన తల్లి గారింటి అమిత్ షా వచ్చారు. ఇదే సమయంలో ఆదిపురుష్ సినిమాను నిషేధించాలని కోరుతున్నాను. రామాయణం ప్రతిష్టకు భంగం కలుగకముందే ఈ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను అని పేర్కొన్నారు.

ఆదిపురుష్ సినిమాపై చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్ స్పందిస్తూ.. శ్రీరామచంద్రుడు, హనుమంతుడి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నది. ప్రజలకు కూడా అదే భావం ఉంది. ఈ చిత్రంలోని డైలాగ్స్, సన్నివేశాలపై రాజకీయ పార్టీలు మౌనం వహించడంపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.


Click it and Unblock the Notifications











