For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Adipurush Teaser: ఆదిపురుష్ ట్రోలింగ్ పై డైరెక్టర్ ఓం రావత్ రియాక్షన్.. మొబైల్స్ కోసం కాదంటూ

  |

  ఈశ్వర్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ఆ తర్వాత అనేక హిట్ సినిమాలు చేసిన ప్రభాస్ 'బాహుబలి' చిత్రం నుంచి తన పంథాను మార్చుకుని వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్నాడు ప్రభాస్. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలను లైన్‌లో పెట్టుకుని.. ఈ యూనివర్సల్ స్టార్ చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇక ప్రభాస్ తాజాగా నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ టీజర్ ను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. టీజర్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇక నెటిజన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి స్టఫ్ దొరికందంటే చాలు మీమ్స్ తో ఆడుకుంటారు. అలానే ఆదిపురుష్ టీజర్ కు జరిగింది. ఈ క్రమంలో తాజాగా ఈ ట్రోలింగ్ పై డైరెక్టర్ ఓం రౌత్ స్పందించాడు.

   సరయు నది ఒడ్డున..

  సరయు నది ఒడ్డున..

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ టీజర్ ను అక్టోబర్ 2న విడుదల చేస్తామని ఇటీవల చిత్రబృందం ప్రకటించినట్లుగానే అదే రోజున ఉత్తరప్రదేశ్ లోని సరయు నది ఒడ్డున రిలీజ్ చేసింది. ఒక నిమిషం 46 సెకన్ల పాటు సాగిన ఈ టీజర్ చూసిన ప్రేక్షకులు, డార్లింగ్ ఫ్యాన్స్ తోపాటు రాజకీయ వేత్తలు అసహనం వ్యక్తం చేశారు. ఇక నెటిజన్లయితే మీమ్స్ తో రెచ్చిపోయారు.

   వింత జీవులను సృష్టించాడని..

  వింత జీవులను సృష్టించాడని..

  ఆదిపురుష్ టీజర్ ఒక ప్లానేట్ ఆఫ్ ది ఏప్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, పైరెట్స్ ఆఫ్ ది కరెబియన్ వంటి చిత్రాల నుంచి కాపీ కొట్టి వింత జీవులను సృష్టించాడని ఆరోపించారు. ఈవిల్ డెడ్ లో ఉన్న గ్రాఫిక్స్ లా ఆ వింత జీవులేంటని మీమ్స్ తో కడిగేశారు. మళ్లీ హనుమంతుని సైన్యంలో ఒక పాత్ర టెంపుల్ రన్ గేమ్ లా ఉందని, అసలు ఈ సినిమా కోసం నిజంగానే 500 కోట్లు ఖర్చుపెట్టారా అనేక రకాలు ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు.

  అంత క్వాలిటీతో లేదని..

  అంత క్వాలిటీతో లేదని..

  త్రీడీ మోషన్ పిక్చర్ క్వాలిటీతో ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ అదేమీ అంత క్వాలిటీతో లేదని అసలు చిన్న పిల్లలు చూసే బొమ్మల తరహాలో గ్రాఫిక్స్ ఉంది అని ఆవేదన చెందుతున్నారు. అసలు ఈ రేంజ్ లో ఉంటుంది అని ఊహించలేదు అని దర్శకుడు ఇన్ని రోజులు కష్టపడింది దీని కోసమా అని షాక్ అయ్యారు.

  ప్రేక్షకుల ఆనందం కోసం..

  ప్రేక్షకుల ఆనందం కోసం..

  తాజాగా ఈ ట్రోలింగ్ పై ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ స్పందించారు. ''ఇది బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కోసం సినిమా తీశాం. ప్రేక్షకుల ఆనందం కోసం సినిమా టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ చేశాం. మొబైల్ ఫోన్ లో టీజర్ చూస్తే కొంత భిన్నంగా ఉంటుంది. మీమ్స్, ట్రోల్స్ నన్ను సర్ ప్రైజ్ చేయలేదు. కానీ, ఈ విమర్శలు చూసు మొదట కొంత ధైర్యం కోల్పోయిన మాట నిజమే. మా చిత్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ కు యూట్యూబ్ ఛానెల్ ఉంది.

   ప్రపంచంలో అతిపెద్ద యూట్యూబ్ ఛానల్..

  ప్రపంచంలో అతిపెద్ద యూట్యూబ్ ఛానల్..

  అది ప్రపంచంలో అతిపెద్ద యూట్యూబ్ ఛానల్. దానికోసం మేము సినిమా తీయలేదు. థియేటర్లకు వస్తున్న ప్రేక్షకులు మాత్రమే కాదు.. మారుమూల గ్రామాల ప్రజలను కూడా థియేటర్లకు రప్పించేందుకే ఆదిపురుష్ ఇలా తెరకెక్కించాం'' అని ఓం రౌత్ తెలిపాడు. ఇక ఇదిలా ఉంటే టీజర్ విడుదలయ్యాక దానిపై వచ్చిన రియాక్షన్స్ చూసి డైరెక్టర్ ఓం రౌత్ పై ప్రభాస్ సీరియస్ అయినట్లు ఓ వీడియో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

  నా గదిలోకి రా అంటూ పిలవడం పై..

  నా గదిలోకి రా అంటూ పిలవడం పై..

  ఆ వీడియోలో ప్రభాస్ దర్శకుడిని సీరియస్.. నా గదిలోకి రా అంటూ పిలవడం పై సోషల్ మీడియాలో కూడా అనేక రకాల మీమ్స్ సైతం వైరల్ అయ్యాయి. ఓం రౌత్ ప్రభాస్ పిలుస్తున్న విధానం చూస్తూ ఉంటే టీజర్ తర్వాతనే ఇది జరిగిందని అనుకున్నారు. ఎందుకంటే టీజర్ రిలీజ్ అప్పుడు ప్రభాస్ ఏ డ్రెస్ లో ఉన్నాడో అదే డ్రెస్ లో వీడియోలో కనిపించాడు. ఈ వీడియోపై అనేక విధంగా కామెంట్స్ వచ్చాయి. అయితే తర్వాత సినిమాకు సంబంధించిన మూవీ జర్నలిస్టు ఒకరు అదంతా వట్టిదే అని క్లారిటీ ఇచ్చారు. సినిమా ప్రమోషన్స్ కోసమే ఓం రౌత్ ను ప్రభాస్ పిలిచాడని ఆయన చెప్పుకొచ్చాడు.

  English summary
  Prabhas Starrer Adipurush Movie Director Reacts To Heavy Trolling And Says Its For Big Screen Experience Not For Mobiles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X