హైపర్ ఆదితో గొడవలు.. అంతా వాళ్లే చేశారు.. అసలు విషయం చెప్పేసిన అదిరే అభి

Recommended Video

Adhire Abhi Clarifies On Conflicts With Hyper Aadi || Filmibeat Telugu

'జబర్థస్త్'.. కామెడీ షోగా తెలుగు వాళ్లకు ఈ షో ఎంతో పరిచయం. ఇదే షో ఎన్నో వివాదాలను ఎదుర్కొంది.. ఎన్నో విజయాలనూ అందుకుంది. ఎంతో మంది కళాకారులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఈ షో వల్లే చాలా మంది సెలెబ్రిటీలు అయిపోయారు. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమలో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అలాంటి వారిలో అదిరే అభి అలియాస్ అభినయ కృష్ణ ఒకడు. తాజాగా అభి ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

‘జబర్ధస్త్' కంటే ముందే..

‘జబర్ధస్త్' కంటే ముందే..

అదిరే అభి ‘జబర్థస్' షో కంటే ముందే సినిమాల్లో నటించాడు. బుల్లితెరపై యాంకర్‌గా కనిపించాడు. అయినా.. అంతగా పేరు దక్కలేదు. కానీ, ఈ షో తర్వాత అతడు బాగా ఫేమస్ అయ్యాడు. ‘జబర్ధస్త్'లో ఓ టీమ్‌కు లీడర్‌గా ఉన్న అభి.. ఎన్నో సంవత్సరాలుగా అందులో కొనసాగుతూనే ఉన్నాడు. ఎంత మంది మారినా అతడు మాత్రం అలాగే రాణిస్తున్నాడు.

టీమ్ లీడర్‌గా సంతృప్తి

టీమ్ లీడర్‌గా సంతృప్తి

‘జబర్థస్'లో అభి ఓ టీమ్‌కు లీడర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే బయట అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది కళాకారులను బుల్లితెరకు పరిచయం చేశాడు. ఇప్పుడు ఎంతో పాపులర్ అయిన ‘హైపర్ ఆది'ని కూడా పరిచయం చేసింది అభినే. అందుకే టీమ్ లీడర్‌గా సంతృప్తిగా ఉన్నానని చెబుతుంటాడు.

ఆదితో గొడవల గురించి

ఆదితో గొడవల గురించి

‘హైపర్ ఆదికి నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. నాతో విభేదాల కారణంగానే హైపర్ ఆది బయటకు వెళ్లిపోయాడన్న వార్తల్లో వాస్తవం లేదు. కొత్త టీమ్స్‌ను ఏర్పాటు చేయాలని ఆర్గనైజర్లు భావించారు. ఈ క్రమంలోనే అన్ని టీమ్స్‌లో సెకండ్ పొజిషన్‌లో ఉన్న వాళ్లందరినీ కలిపి ఒక టీమ్‌ను తయారు చేశారు. అలా హైపర్ ఆది టీమ్ వచ్చింది. ఆది టీమ్ లీడర్ అయినందుకు సంతోషిస్తాన్నా' అని చెప్పుకొచ్చాడు.

డైరెక్షన్‌పై ఫోకస్

డైరెక్షన్‌పై ఫోకస్

సినీ రంగంలోకి అభి యాక్టింగ్ చేయడానికి రాలేదట. తనకు ఎంతగానో ఇష్టమైన డైరెక్షన్ విభాగంలో అవకాశం కోసం ఇండస్ట్రీకి వచ్చాడని గతంలో చెప్పాడు. ఇప్పుడు కూడా దానిపైనే ఫోకస్ చేస్తున్నానంటున్నాడు. ‘నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. అందుకే జబర్ధస్త్‌లో కొనసాగుతూనే నాకు ఎంతో ఇష్టమైన డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌పై ఫోకస్ చేస్తున్నా' అని చెబుతున్నాడు.

మిమిక్రీ స్పెషలిస్ట్

మిమిక్రీ స్పెషలిస్ట్

అదిరే అభి.. యాక్టర్ గానే కాదు.. మిమిక్రీ ఆర్టిస్టుగానూ రాణించాడు. గతంలో ఎన్నో షోలలో అతడు తన నైపుణ్యాన్ని బయట పెట్టాడు. ‘జబర్ధస్త్'లో కూడా చాలా స్కిట్లలో చిరంజీవి, నాగేశ్వర్రావు సహా ఎందరో సినీ హీరోలను ఇమిటేట్ చేస్తుంటాడు. వీటన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X