దుమ్ము రేపుతున్న అదిరింది.. తొలిరోజు రికార్డు కలెక్షన్లు
తమిళంలో అనేక వివాదాలకు వేదిక మారిన మెర్సల్ చిత్రం అదిరింది పేరుతో తెలుగులో నవంబర్ 9న రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు సమాచారం.
Recommended Video

తమిళంలో అనేక వివాదాలకు వేదిక మారిన మెర్సల్ చిత్రం అదిరింది పేరుతో తెలుగులో నవంబర్ 9న రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం విజయ్ కెరీర్‌లోనే ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా తెలుగులో అత్యధిక వసూళ్లను సాధించడం విశేషం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నట్టు ట్రేడ్ వర్గాల విశ్లేషణ.

అదిరిందికి డివైడ్ టాక్
మెర్సల్ రిలీజైన తర్వాత మూడు వారాలకు అదిరింది చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. తొలి రోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన కనిపించినప్పటికీ.. వసూళ్ల పరంగా మంచి స్పందన వచ్చినట్టు తెలుస్తున్నది. వీకెండ్‌లో మంచి కలెక్షన్లను సాధించడానికి అవకాశం ఉంది అనే మాట ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్నది.

విజయ్ కెరీర్‌లోనే
ఇప్పటివరకు శంకర్ దర్శకత్వంలో వచ్చిన స్నేహితుడు విజయ్‌కి తెలుగులో మంచి ఓపెనింగ్స్‌ను సాధించింది. విజయ్‌కి ఆ కలెక్షన్లే బెస్ట్. ఇప్పుడు స్నేహితుడు రికార్డును అదిరింది తుడిచిపెట్టేసింది.

10 కోట్ల వసూళ్లు
తొలిరోజున అదిరింది చిత్రం 10 కోట్ల వసూలు చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. వారాంతంలో ఇంకా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. తొలివారాంతం తర్వాత ఇదే విధంగా వసూళ్లు ఉంటే తెలుగులో కూడా సినిమా ఘనవిజయం సాధించడానికి ఛాన్స్ ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

తమిళంలో 230 కోట్లు
తమిళంలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్ల వసూలు చేసింది. ఈ చిత్రం విజయ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా పేరు తెచ్చుకొన్నది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్, ఎస్ జే సూర్య తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











