Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హమ్మయ్య..! 'అదిరింది' సెన్సార్ పూర్తి చేసుకుంది: రిలీజ్ డేట్ ఇదే
Recommended Video
విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం 'మెర్సల్' తెలుగులో 'అదిరింది' పేరుతో అక్టోబర్ 27న విడుదల కావాల్సి ఉండగా విడుదల కాలేదు. ఆన్ లైన్లో టికెట్లు కొన్న వారికి డబ్బులు కూడా వాపస్ ఇచ్చేశారు. అయితే సినిమా సెన్సార్ వివాదం వల్లే విడుదల కాలేదనే వాదన ఉంది. అదే సమయంలో తెలుగులోనూ ఈ సినిమాను 'అదిరింది' పేరుతో విడుదల చేయాలనుకున్నారు.
జీఎస్టీని ఉద్దేశించి
‘మెర్సల్' సినిమా తమిళనాడులో దీపావళికి విడుదలైంది. అయితే ఇందులో జీఎస్టీని ఉద్దేశించి డైలాగులు ప్రధానమంత్రి మోడీ నిర్ణయాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టే విధంగా ఉన్నాయంటూ బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆ డైలాగులు తొలగించాలని కొంత మంది కోర్టుకు వెళ్లారు కూడా.
కొన్ని డైలాగ్స్ వివాదాస్పదం
ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ వివాదాస్పదం కావడంతో, ఆ ప్రభావం తెలుగు సినిమా విడుదలపై పడింది. ఈ కారణంగానే ఈ సినిమా అనుకున్న సమయానికి సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోలేకపోయిందన్న వారూ ఉన్నరు. కానీ అసలు సెన్సార్ నుంచి సమస్యలే లేవన్న వాదన కూడా వినిపించింది.
ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు
తెలుగులో ఈ చిత్రాన్ని శరత్ మరార్ విడుదల చేయడానికి రైట్స్ తీసుకున్నారు. అయితే సినిమా రిలీజ్ చివరి నిమిషంలో ఎందుకు ఆగిందనే విషయంపై ఆయన ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. తెలుగు వెర్షన్ ఆంధ్రా, తెలంగాణలో 700 థియేటర్లలో విడుదలకు రంగం సిద్ధం చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ సమయానికి చేతికి అందక పోవడం వల్లనే ఇలా జరిగిందా? లేక మరేదైనా కారణంతో సినిమా రిలీజ్ ఆగిపోయిందా? అనే విషయం తెలియాల్సి ఉంది.
రీమేక్ చేసే ఉద్దేశంతోనే
ఈ నేపథ్యంలో ఈ సినిమాను రీమేక్ చేసే ఉద్దేశంతోనే .. రిలీజ్‌ను ఆపేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆ ప్రచారానికి తెరదించేస్తూ తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. దాంతో ఈ సినిమాను ఈ నెల 9వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.