twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హమ్మయ్య..! 'అదిరింది' సెన్సార్ పూర్తి చేసుకుంది: రిలీజ్ డేట్ ఇదే

    |

    Recommended Video

    హమ్మయ్య..! 'అదిరింది' రిలీజ్ డేట్ ఇదే..

    విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం 'మెర్సల్' తెలుగులో 'అదిరింది' పేరుతో అక్టోబర్ 27న విడుదల కావాల్సి ఉండగా విడుదల కాలేదు. ఆన్ లైన్లో టికెట్లు కొన్న వారికి డబ్బులు కూడా వాపస్ ఇచ్చేశారు. అయితే సినిమా సెన్సార్ వివాదం వల్లే విడుదల కాలేదనే వాదన ఉంది. అదే సమయంలో తెలుగులోనూ ఈ సినిమాను 'అదిరింది' పేరుతో విడుదల చేయాలనుకున్నారు.

    జీఎస్టీ‌ని ఉద్దేశించి

    జీఎస్టీ‌ని ఉద్దేశించి

    ‘మెర్సల్' సినిమా తమిళనాడులో దీపావళికి విడుదలైంది. అయితే ఇందులో జీఎస్టీ‌ని ఉద్దేశించి డైలాగులు ప్రధానమంత్రి మోడీ నిర్ణయాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టే విధంగా ఉన్నాయంటూ బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆ డైలాగులు తొలగించాలని కొంత మంది కోర్టుకు వెళ్లారు కూడా.

    కొన్ని డైలాగ్స్ వివాదాస్పదం

    కొన్ని డైలాగ్స్ వివాదాస్పదం

    ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ వివాదాస్పదం కావడంతో, ఆ ప్రభావం తెలుగు సినిమా విడుదలపై పడింది. ఈ కారణంగానే ఈ సినిమా అనుకున్న సమయానికి సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోలేకపోయిందన్న వారూ ఉన్నరు. కానీ అసలు సెన్సార్ నుంచి సమస్యలే లేవన్న వాదన కూడా వినిపించింది.

    ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు

    ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు

    తెలుగులో ఈ చిత్రాన్ని శరత్ మరార్ విడుదల చేయడానికి రైట్స్ తీసుకున్నారు. అయితే సినిమా రిలీజ్ చివరి నిమిషంలో ఎందుకు ఆగిందనే విషయంపై ఆయన ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. తెలుగు వెర్షన్ ఆంధ్రా, తెలంగాణలో 700 థియేటర్లలో విడుదలకు రంగం సిద్ధం చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ సమయానికి చేతికి అందక పోవడం వల్లనే ఇలా జరిగిందా? లేక మరేదైనా కారణంతో సినిమా రిలీజ్ ఆగిపోయిందా? అనే విషయం తెలియాల్సి ఉంది.

    రీమేక్ చేసే ఉద్దేశంతోనే

    రీమేక్ చేసే ఉద్దేశంతోనే

    ఈ నేపథ్యంలో ఈ సినిమాను రీమేక్ చేసే ఉద్దేశంతోనే .. రిలీజ్‌ను ఆపేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆ ప్రచారానికి తెరదించేస్తూ తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. దాంతో ఈ సినిమాను ఈ నెల 9వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

    English summary
    The Telugu version of Tamil film Mersal starring Vijay, which has been the centre of controversy, may finally release by next week. The Telugu version of the film, titled Adhirndhi, will release on November 9, as the censor board has now cleared the film
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X