కృష్ణవంశి సీన్లు వల్గర్ గా...
ఒకటి రెండు రోజులు షూటింగ్ చేసాక డైరక్టర్ కృష్ణవంశి గారు కొన్ని సీన్లు ఎక్సప్లెయిన్ చేసారు...కానీ అవి చాలా వల్గర్ గా అనిపించాయి. కాంట్రాక్ట్ సైన్ చేయకముందు అవి చెప్పలేదు. అందుకుని చేయనన్నాను. ఆయన పెద్ద డైరక్టర్ కావటంతో నేనలా చెప్పటం నచ్చలేదు. నువ్వు ఆ సీన్స్ చేస్తేనే ఈ ప్రాజెక్టులో ఉండేది అన్నారు. కానీ అవి ఉంటే నేను ఉండను అని నేనన్నాను. అలా ఇద్దరికీ అభిప్రాయ బేధాలు రావడంతో కలసి పనిచేయకూడదనే నిర్ణయానికి వచ్చాం అంటూ చెప్పుకొచ్చింది అదితి అగర్వాల్. ఆర్తి అగర్వాల్ చెల్లెలైన ఆమె గంగోత్రి అనంతరం శ్రీ ఆంజనేయం చిత్రంలో వచ్చిన ఆపర్..అది పోయిన విధానం గురించి చెబుతూ. అలాగే ఆ సినిమా రిలీజయ్యాక ఆ సీన్స్ చేయనందుకు చాలా సంతోషించాను అని చెప్పుకొచ్చింది తాజాగా ఓ పత్రిక కిచ్చిన ఇంటర్వూలో. ఆ తర్వాత శ్రీ ఆంజనేయం చిత్రంలో ఛార్మి చేసిన సంగతి తెలిసిందే. భక్తి కంటే రక్తి ఎక్కువైదని ఆ టైమ్ లో కామెంట్స్ కూడా వచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











