twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేనికైనా రెడీ అంటున్నా బన్నీ ఫస్ట్ లవర్....

    By Sindhu
    |

    'గంగోత్రి" చిత్రంలో అదితీ అగర్వాల్‌ ని చూసిన వారందరూ తెలుగు తెరకు మరో స్టార్ హీరోయిన్ వచ్చిందని అభిప్రాయపడ్డారు. కానీ ఆ అభిప్రాయాలన్నీ మాటలకే పరిమితమయ్యాయి. 'గంగోత్రి" విజయం అదితీ కి మూన్నాళ్ళ ముచ్చటే అయ్యింది. ప్రస్తుతం ఆమె కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన సాగుతోంది. ఇదే విషయాన్ని ఆమెతో ప్రస్తావిస్తే 'అది నా స్వయంకృతాపరాధం. నా తొలి సినిమా టైమ్‌ లో అక్క టాప్ హీరోయిన్‌ గా వెలుగొందుతోంది. ఆమె ద్వారానే నాకు 'గంగోత్రి"లో అవకాశం వచ్చింది. అందరి అంచనాలను నిజం చేస్తూ ఆ సినిమా అఖండ విజయం సాధించింది. గంగోత్రి తర్వతా కొడుకు, విద్యార్థి సినిమాలలో నటించినా ఆ సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో టాలీవుడ్ కు కనుమెరుగైంది.

    ప్రస్తుతం శివాజీ హీరోగా చిత్రీకరణ దశలో ఉన్న 'లోకమే కొత్తగా" సినిమా నా కెరీర్‌కు తప్పక హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను" అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ-'చిత్ర పరిశ్రమ మొత్తం గ్లామర్ చుట్టూ తిరుగుతుంటుంది. ఇక్కడ మడి కట్టుకొని కూర్చుంటే ఉపయోగం ఉండదు. అందుకే సన్నివేశం డిమాండ్ చేస్తే బికినీ ధరించడానికైనా, ముద్దు సీన్ లలోనైనా నేను నటించేందుకు సిద్ధమే" అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. మరి కనీసం ఇప్పుడైనా అదితికి అవకాశాలు వరిస్తాయో లేదో…వేచి చూడాలి మరి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X