అనుష్క ‘రుద్రమదేవి’లో తికిటతకిట పాప

అనుష్క టైటిల్ రోల్ చేస్తున్న ఈచిత్రంలో అనుష్క రుద్రమదేవి పాత్రలో, రాణా చాళుక్య వీరభద్రుడి పాత్రలో, కృష్ణం రాజు గణపతి దేవ చక్రవర్తి పాత్రలో, ప్రకాష్ రాజ్ మహామంత్రి శివ దేవయ్య పాత్రలో, అజయ్ ప్రసాదాదిత్య పాత్రలో, రవిబాబు నాగదేవుడు పాత్రలో, నథాలియా కౌర్ అన్నాంబిక పాత్రలో, హంసానందిని మదనిక పాత్రలో, ప్రభ సోమాంబ పాత్రలో నటిస్తోంది.
ఇతర ముఖ్య పాత్రల్లో బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. ఒక్కడు సినిమా కోసం 'చార్మినార్' సెట్ నిర్మించిన గోపనపల్లి ప్రాంతంలో భారీ సెట్ వేసారు. కాకతీయుల వైభవాన్ని చాటి చెప్పే 11 భారీ సెట్లను ఈ చిత్రం కోసం నిర్మిస్తున్నారు.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.


Click it and Unblock the Notifications











