చేతిలో వరుణ్ తేజ్ సినిమా.. షాక్ ఇచ్చిన అదితి రావు హైదరి!
బాలీవుడ్ భామల తాకిడి క్రమంగా టాలీవుడ్ పై ఎక్కువవుతోంది. శ్రద్దా కపూర్, కైరా అద్వానీ వంటి హీరోయిన్లు ఇప్పటికే టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. వారి కోవలోనే మరో హాట్ బ్యూటీ అదితి రావు హైదరి పయనిస్తోంది. అదితి రావు హైదరి ప్రస్తుతం వరుణ్ తేజ్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. స్పేస్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఘాజి ఫేమ్ సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్నారు.
అదితి రావు హైదరి సుదీర్ బాబు సరసన సమ్మోహనం అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం విడుదల కాక ముందే అదితి టాలీవుడ్ నిర్మాతలకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదితి తన రెమ్యునరేషన్ 50 లక్షలకు పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో తనకు పెరుగుతున్న డిమాండ్ చూసి అదితి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సీనియర్ హీరోలు బాలయ్య, వెంకటేష్ వంటి వారు కూడా ఈ హాట్ బ్యూటీని తమ చిత్రంలోకి తీసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అదితి ప్రతిభ గల నటి. ఆమె పద్మావత్ వంటి చిత్రంలో కూడా నటించింది. దీనితో అదితి తన పారితోషకం పెంచడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











