ఆ సినిమా చూసి హీరోయిన్ కావాలనుకొన్నా.. అతడంటే ఇష్టం.. అదితిరావు
Recommended Video

వైవిధ్యమైన నటనతో ఆకట్టుకొంటున్న అదితిరావు హైదరీ తాజాగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న నవాబు చిత్రంలో నటిస్తున్నది. గతంలో మణిరత్నం తెరకెక్కించిన చెలియా చిత్రంలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలుగులో వచ్చిన సమ్మోహనం చిత్రంతో భారీ సక్సెస్ అందుకొన్నది. ఈ నేపథ్యంలో మణిరత్నం, అదితిరావు కాంబినేషన్‌లో వస్తున్న నవాబుపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..

బొంబాయి సినిమా చూసి
సినీ పరిశ్రమ అంటే ఏమిటో తెలియని నాకు ఇలాంటి అవకాశం రావడం అదృష్టమే. బాల్యం నుంచి ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను. మణిరత్నం సార్ దర్శకత్వం వహించిన బొంబాయి సినిమా చూసిన తర్వాత.. హీరోయిన్ కావాలని అనుకొన్నాను. అది కూడా మణిరత్నం చిత్రంలో నటించాలని అనుకొన్నాను.

మణిరత్నం సార్ అంటే
నాకు మణిరత్నం సార్ అంటే చాలా ఇష్టం. ఆయనంటే గౌరవమే కాకుండా స్ఫూర్తిని కలిగించే వ్యక్తి. అలాంటి వారితో కలిసి పనిచేయడమంటే ఎప్పటికైనా ఇష్టమే. ఎప్పుడూ నాలోని ప్రతిభను రాబట్టడానికి ఆయన ప్రయత్నిస్తుంటారు. అందుకే ఆయనతో పనిచేయడానికి ఉత్సాహం కలుగుతుంది.

నవాబు మంచి థ్రిల్లర్
మణిరత్నం గొప్ప రచయిత. కథను అద్భుతంగా చెప్పే దర్శకుడు. వ్యక్తిత్వంలో చాలా భిన్నమైన వ్యక్తి. ఆయన చాలా థ్రిల్లర్ చిత్రాలు రూపొందించారు. కానీ నేను నటించలేదు. నవాబు ఓ మంచి థ్రిల్లర్. నాకు బాగా నచ్చింది అని అదితిరావు వెల్లడించారు.

దర్శకుడు మిస్కన్ చిత్రంలో
నవాబు చిత్రం తర్వాత తమిళంలో మిస్కిన్ రూపొందించే చిత్రంలో నటిస్తున్నాను. కథ కొత్తగా ఉంటుంది. ఆ సినిమా కథ విన్న తర్వాత ఎక్సౌటింగ్‌గా అనిపించింది. మిస్కిన్ ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. గ్లామర్ హీరోయిన్ అనే ముద్ర నుంచి పక్కింటి అమ్మాయి అనే బ్రాండ్ వేసే పాత్ర.

విభిన్నమైన పాత్రల్లో
యాక్టర్‌గా నేను విభిన్నమైన పాత్రలు పోషించడానికి ప్రయత్నిస్తాను. అందుకే మిస్కిన్ చెప్పిన కథ నచ్చింది. నా కెరీర్‌లో గొప్ప చిత్రంగా మిగిలిపోతుంది. రొటీన్ పాత్రల కంటే వైవిధ్యమైన పాత్రలు వస్తే నటించడానికి ఎప్పుడైనా సిద్ధమే అని అదితిరావు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











