999తో సీక్వెల్‌కు ప్లాన్ చేసిన బాలయ్య

By Bojja Kumar

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా వచ్చిన 'ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్‌గా ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో అనుష్కను బాలయ్య సరసన హీరోయిన్‌గా అనుకుంటున్పప్పటికీ అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఈ సీక్వెల్‌కు 'ఆదిత్య 999' అనే పేరు పరిశీలిస్తున్నారట.

కేవలం అంకెలు మాత్రమే మార్చడానికి ప్రత్యేకమైన కారణం ఉందని, బాలయ్యకు కలిసొస్తుందనే నమ్మకంతోనే సినిమా హిట్ కొట్టాలని 369ని, 999గా మార్చారని అంటున్నారు. మరి వాళ్ల నమ్మకం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. బాలయ్య ఈ సీక్వెల్‌పై చాలా ఆసక్తి చూపుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్లోర్ మీదకు రానుంది.

ఈచిత్ర సీక్వెల్‌లో నటించబోతున్నట్లు బాలయ్య గతంలోనే ప్రకటించారు. సింగితం శ్రీనివాస రావు దర్శకత్వం వహించనున్న ఈ మూవీని కొండ కృష్ణం రాజు సమర్పణలో వినోద్ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే కథ చర్చలు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం ఆగస్టు నుంచి ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 10 బాలయ్య బర్త్ డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వెలువడనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.

తాజాగా బాలయ్య నటించిన 'అధినాయకుడు' చిత్రం జూన్ 1న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈచిత్రం కలెక్షన్ల పరంగానే కాకుండా అనేక మందికి అనేక రకాలుగా సమాధానం చెబుతుందని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. సినిమాలో పొలిటికల్ సెటైర్లు ఉన్న మాట వాస్తవమే అని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలనే సినిమాలో చూపించామని స్పష్టం చేశారు. ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మించిన అధినాయుకడు చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహించారు. బాలయ్య సరసన లక్ష్మిరాయ్, సలోని నటించారు. కళ్యాణి మాణిక్ సంగీతం అందించారు. బాలయ్య ఈచిత్రంలో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X