ఆర్య-2 నిర్మాత హీరోగా కనపడేది ఆ రోజే
ఆదిత్య బాబు హీరోగా ఆదిత్య ఆర్ట్స్ సంస్థ నిర్మించిన చిత్రం 'చలాకీ' ఈ నెల 20న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కన్నడ దర్శకుడు మాదేష్ ఈ చిత్రాన్ని ఫన్ ఎంటర్టైనర్ గా మలిచారని చెప్తున్నారు. రోమా, బియాంకా దేశాయ్ హీరోయిన్లుగా చేసిన ఈ చిత్రం చాక్లెట్ అనే మళయాళ చిత్రానికి రీమేక్. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ....జగడం, ఆర్య-2 తర్వాత మా సంస్థ నిర్మించిన చిత్రమిది. యువతను అమితంగా ఆకట్టుకుంటుంది. మహిళా కళాశాలలో ఓ యువకుడు చదువుతుంటాడు. అతనికి ఆ అవసరం ఎందుకొచ్చింది? అతని కథాకమామీషు ఏమిటన్నది ఆసక్తికరం. అలాగే పాటలకు మంచి స్పందన వస్తోంది. చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ న్నారు. ఇక ఈ చిత్రానికి మూల కథ..సచి-సేతు, మాటలు..గంగోత్రి విశ్వనాథ్, సంగీతం...హరికృష్ణ, కెమెరా...బాలమురుగన్, కూర్పు ...మార్తాండ్ కె వెంకటేష్ అందిస్తున్నారు. ఇంతకు ముందు ఆడువారి మాటలకు అర్ధాలే వేరులో చిత్రాన్ని కన్నడంలో రీమేక్ చేసి హీరోగా చేసి విజయం సాధించాడు ఆదిత్య బాబు. గుడుంబా శంకర్, నమ్మ బసవ చిత్రాల దర్శకుడు వీర్ శంకర్ ఆ చిత్రాన్ని డైరక్ట్ చేసాడు. ఆదిత్య బాబు హీరోగానే కాక కన్నడంలో పునీత్ రాజకుమార్ తోనూ, శివరాజ కుమార్ తోనూ చిత్రాలు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











