రవితేజ, ప్రభాస్ లతో కమిటయ్యా: 'ఆర్య 2' నిర్మాత
ఆదిత్య ఆర్ట్స్‌లో రవితేజ, ప్రభాస్ తో కమిట్‌మెంట్ వుంది. కథలు వారికి సరిపడక వెయిట్ చేస్తున్నాను. అలాగే రామ్ చరణ్ తో ఒక సినిమా వుంటుంది. సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ తో ఒక సినిమా అనుకున్నా. ఇంకా మహేష్‌కు చెప్పలేదు. స్క్రిప్ట్ ఫైనలైజ్ అవుతోంది అంటున్నారు ఆర్య 2 నిర్మాత ఆదిత్య బాబు. ఆయన హీరోగా చేసిన చలాకి చిత్రం రీసెంట్ గా రిలీజై ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ఆ చిత్రం ప్రమేషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ..తను త్వరలో చేయబోయే చిత్రాలు చెప్పుకొచ్చారు.
ఇక ఇప్పటికే ఆదిత్య బాబు...రామ్ తో జగడం, అల్లు అర్జున్ తో ఆర్య 2 చిత్రాలు చేసారు. అలాగే తనకే రకమైన చిత్రాలు ఇష్టమో చెబుతూ...నా వరకైతే ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు ఇష్టం. ఒక ప్రేక్షకుడు థియే టర్‌కి వచ్చి రెండున్నర గంటలు తన కష్టాలు మరచి కొంచెం కామెడీ, కొన్ని ఫైట్స్, కొంచెం సెంటిమెంట్, కొన్ని పాటలు, లొకేషన్స్ చూసి ఎంజారు చేసేలా వుండాలి. టోటల్ గా ఎంటర్ టైన్ మెంట్ వుండాలి. అలాగే నేను ఇంగ్లీషు సినిమాలు చూడను. జాకీ చాన్, జేమ్స్‌బాండ్ సినిమాలు మాత్రమే చూస్తాను. తెలుగులో అయితే 'చంటబ్బాయి' చాలాసార్లు చూశాను అన్నారు.


Click it and Unblock the Notifications











