హాలీవుడ్ లో విద్యాబాలన్ చిత్రం రీమేక్ ఖరారు
విద్యాబాలన్ గర్భవతిగా నటించిన 'కహానీ' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. దాంతో ఇప్పుడా చిత్రాన్ని హాలీవుడ్ లో నిర్మించి విడుదల చేయాలని యష్ రాజ్ సంస్ధ నిర్ణయించుకుంది. ఈ మేరకు నిర్మాత ఆదిత్య చోప్రా ఇప్పటికే కహానీ బృందంతో చర్చలు సాగించారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్‌కి చెందిన విదేశీ విభాగం ద్వారా ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌లో నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ యేడాదే ఇది సెట్స్ మీదకు వెళ్తుంది. విద్యాబాలన్‌నే ప్రధాన పాత్ర పోషించమని కోరుతున్నాం..ఆని సంస్ద ప్రతినిధులు మీడియాకు తెలియచేసారు. అలాగే ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు దక్షిణాది నిర్మాతలూ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక కలెక్షన్స్ విషయానికి వస్త కహాని పెద్ద రికార్డునే క్రియేట్ చేసింది. కేవలం 8 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మార్చి 9 నుంచి 26 వరకు అంటే కేవలం 17 రోజుల్లోనే రూ. 43 కోట్లను వసూలు చేసి, బంపర్‌హిట్‌గా నిలిచింది 'కహానీ'. క్రితం సంవత్సరం వచ్చిన 'ద డర్టీ పిక్చర్'తో సూపర్‌హిట్ సాధించి, ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా రూ. వంద కోట్ల మార్కును సాధించడమేమిటని అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేసిన విద్యాబాలన్ తాజాగా మరో సూపర్‌హిట్ కొట్టడం అందరి హీరోలను ఆశ్చర్యంలో ముంచేసింది.
ఇది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమే కావడం విశేషం. అందులోనూ డర్టి పిక్చర్... సినిమా విద్య స్కిన్ షో కారణంగానే హిట్టయ్యిందనే విమర్శకులకు సైతం 'కహానీ' గట్టి సమాధానమిచ్చింది. ఇందులో ఆమె గర్భవతిగా డీ గ్లామర్డ్ కేరక్టర్‌ను చేసింది. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బంపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో విద్య నటనకు ఫిదా అయిన అమీర్‌ఖాన్ ఆమెతో కలిసి నటించాలనే కోరిక వ్యక్తం చేయడం ఆమె ప్రతిభకు లభించిన మరో గుర్తింపు గా ఆమె చెప్తోంది.
మరో ప్రక్క ఆల్రెడీ స్నేహను కహానీ రీమేక్ చేయటానికి ఒప్పించారని తమిళ మీడియా చెప్తోంది. కహానిలో విద్యాబాలన్ చేసిన ఏడు నెలల గర్బవతి పాత్రను స్నేహ చేయటానికి ఆసక్తి చూపిస్తోందని అంటోంది. ఎలాగూ వివాహం అయ్యింది కాబట్టి ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించటం హ్యాపీ అన్నట్లుగా ఆమె ఒప్పుకుందని అంటున్నారు. తెరపై వివాహం అయ్యి గ్లామర్ పండించటం కన్నా తన నటనతో కట్టిపారేయాలనే ఆలోచనతో స్నేహ ఉందిట. త్వరలోనే ఈ మేరకు ప్రకటన రావచ్చు అని చెప్తున్నారు. తమిళ,తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందుతుంది. రీమేక్ ల స్పెషలిస్టు డైరక్టర్ ఒకరకి ఈ చిత్రం రీమేక్ ని అప్పచెప్తారని వినికిడి.


Click it and Unblock the Notifications











