'ఆరంజ్' ఆడియో హక్కుల్ని సొంతం చేసుకొన్న ఆదిత్య!
చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆరంజ్" ఆడియో హక్కుల్ని ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ పెద్ద మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. దాదాపు కోటి రూపాయలు దాకా 'ఆరంజ్" ఆడియో ధర పలికిందని విశ్వసనీయ సమాచారం. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో రూపొందబడుతున్న ఈ చిత్రానికి హ్యారిస్ జయరాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఇటీవలే ఆస్ట్రేలియా లో ఒక షెడ్యూల్ ముగించుకున్న ఈ చిత్రంలో జెనీలియా, షాజాన్ పదామ్సీ, సంచిత శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే ఆసక్తిని రేకెత్తిస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా పెద్ద మొత్తాలకు ఈ చిత్ర పంపిణీ హక్కుల్ని పొందేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని టాలీవుడ్ టాక్.


Click it and Unblock the Notifications











