వెంకటేష్ సినిమాలో సల్మాన్ ఖాన్ విలన్
సల్మాన్ ఖాన్ చిత్రం బాడీ గార్డ్ లో విలన్ గా చేసిన ఆదిత్యా పంచోలిని తాజాగా వెంకీ తన సినిమాకు తీసుకున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న షాడో చిత్రంలో ఆదిత్యాకు కీ రోల్ ని ఇచ్చారు. మార్చి ఏడు నుంచి జరిగే రెండో షెడ్యూల్ కి లో ఈ విలన్ ఉంటాడు. ఇక ఫస్ట్ షెడ్యూల్ విజయవంతగా పూర్తి చేసుకువచ్చారు.
ఇక యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకేటేష్ సరసన తాప్సీ హీరోయిన్ గా చేస్తోంది. తమన్ సంగీతం అందిస్తూంటే హీరో శ్రీకాంత్ మరో కీలక పాత్రలో చేస్తున్నాడు. శ్రీకాంత్ సరసన మధురిమ హీరోయిన్ గా చేస్తోంది. కోన వెంకట్,గోపీ మోహన్ కథ-మాటలు అందిస్తున్న ఈ చిత్రాన్ని సింహ నిర్మాత పరుచూరి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇక వెంకటేష్ అన్న కొడుకు రానాతో పరుచూరి ప్రసాద్ ఇప్పటికే నా ఇష్టం చిత్రాన్ని పూర్తి చేసి విడుదలకు రెడీ చేసారు. వెంకటేష్ బాడీగార్డ్ చిత్రం యావరేజ్ గా ఆడిన నేపధ్యంలో ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్టు కొట్టాలని చేస్తున్నారు. అలాగే వెంకటేష్ ..దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











