జియాఖాన్ కేసు: ‘నా కొడుకును జైల్లో ఉండనివ్వండి’
ఆదిత్య మాట్లాడుతూ... 'ఈ కొన్ని రోజులైనా నా కొడుకును జైల్లో ఉండనివ్వండి. అప్పుడే దృఢచిత్తం కలిగిన తెలివైన వ్యక్తిగా మారతాడు. జైలు జీవితం సూరజ్‌ను మారుస్తుందనుకుంటున్నా'నని అన్నాడు.
ఈ నెల 3న జియా ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమె రాసిన లేఖ ఆధారంగా రెండ్రోజులకు సూరజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే సూరజ్ అరెస్టయినప్పటి నుంచి అతని తల్లిదండ్రులు తరచూ మీడియాతో మాట్లాడుతూనే ఉన్నారు.
జియాఖాన్ ఆత్మహత్య వివాదంలో తన కొడుకు సూరజ్‌ను విలన్‌ను చేయొద్దని నటుడు ఆదిత్య పంచోలి కోరారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తన కుమారుడిపై అభియోగాలు మోపొద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సూరజ్ తప్పుచేసినట్లు రుజువైతే అతన్ని నింధించడంలో తప్పులేదన్నారు. జియాఖాన్ ఆత్మహత్య నేపథ్యంలో రచయిత శోభా దే తన బ్లాగులో ఆదిత్య, సూరజ్‌లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆదిత్య పై విధంగా స్పందించారు.


Click it and Unblock the Notifications












