హీరో హీరోయిన్ రంజాన్ స్పెషల్ ‘దావత్’ (ఫోటోస్)
ముంబై: బాలీవుడ్ కుర్రతారలు ఆదిత్యరాయ్ కపూర్, పరిణీతి చోప్రా ప్రస్తుతం 'దావత్-ఇ-ఇష్క్' అనే అనే చిత్రంలో నటిస్తున్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఈ ఇద్దరూ ముంబైలోని మహ్మద్ అలీ రోడ్‌ను సందర్శించి రంజాన్ స్పెషల్ వంటకాలను ఆరగించి దావత్ చేసుకున్నారు. ఇదంతా 'దావత్-ఇ-ఇష్క్' ప్రమోషన్లో భాగంగా చేసినట్లు తెలుస్తోంది.
ముంబైలోని మహ్మద్ అలీ రోడ్ నూరూరించే రంజాన్ వంటకాలకు ప్రసిద్ధి గాంచింది. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే ముస్లిం సోదరులు ఉపవాస దీక్షి విరమించానికి ఇక్కడికే వస్తుంటారు. ముంబైలో మరెక్కడా దొరకని రుచికరమైన, ప్రత్యేకమైన వంటకాలు ఇక్కడ నోరూరిస్తాయి.
దావత్-ఇ-ఇష్క్ సినిమా విషయానికొస్తే....ఈచిత్రాన్ని హబీబ్ పైజల్ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంటర్ 5న సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. స్లైడ్ షోలో ఫోటోలు..

పరిణీతి చోప్రా, ఆదిత్య చోప్రా దావత్
మహ్మద్ అలీ రోడ్లో వివిధ రకాల వంటకాలను ఆరగిస్తున్న పరిణీతి చోప్రా, ఆదిత్యరాయ్ కపూర్. ఈ ఇద్దరూ రావడంతో చాలా మంది అక్కడ గుమికూడారు. ఆటోగ్రాఫుల కోసం ఎగబడ్డారు.

లొట్టలేసుకుంటూ తిన్నారు
పరిణీతి చోప్రా, ఆదిత్య రాయ్ కపూర్ ఇక్కడ రకరకాల వంటలు టేస్టు చేస్తూ లొట్టలేసుకుంటూ తిన్నారు.

సూపర్...
మహ్మద్ అలీ రోడ్లో వంటకాలు చాలా టేస్టీగా ఉన్నాయని పరిణీతి చోప్రా, ఆదిత్యరాయ్ కపూర్ కితాబిచ్చారు.

సెల్ఫీ టైం..
దావత్ సందర్భంగా పరిణీతి చోప్రా, ఆదిత్య రాయ్ కపూర్ ఇలా సెల్పీ ఫోటోలు తీసుకున్నారు.

నిజ జీవితంలో కూడా...
నిజ జీవితంలో కూడా పరిణీతి చోప్రా, ఆదిత్య రాయ్ కపూర్ ఫుడ్ లవర్స్. డైటింగ్ గురించి ఆలోచించకుండా నచ్చితే అన్ని లాగించేస్తుంటారు.


Click it and Unblock the Notifications











