ప్రేమలో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చిన అడివి శేష్.. ఆ అమ్మాయి ఎవరంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నా కూడా కాస్త విభిన్నంగా కొత్తగా ట్రై చేసే టాలెంటెడ్ హీరోలు మాత్రం కొంతమంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో అడివి శేష్ ఒకరు. మనోడు ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో ఎదో ఒక డిఫరెంట్ పాయింట్ హైలెట్ అవుతుంటుంది. ఓ వర్గం జనాలు మాత్రం అతని సినిమాలకు బాగానే ఎట్రాక్ట్ అవుతున్నారు. అయితే చాలా రోజుల తరువాత ఆడివిశేష్ తన పర్సనల్ లైఫ్ పై స్పందించారు. తన ప్రేమపై కూడా ఒక క్లారిటీ ఇచ్చేశాడు.

ఆర్థిక ఇబ్బందులు
అడివి శేష్ కెరీర్ మొదట్లో తన సొంత డైరెక్షన్ లోనే సినిమాలు చేసుకుంటూ ప్రయత్నాలు చేశాడు. నిర్మాతగా కూడా పలు సినిమాలను తెరకెక్కించాడు. కానీ అవేవి వర్కౌట్ కాకపోగా భారీ స్థాయిలో ఆర్థిక ఇబ్బందులు కూడా పడాల్సి వచ్చింది. అనంతరం మెల్లగా నటుడిగా మారి మళ్ళీ తానెంటో నిరూపించుకున్నాడు.

పంజా.. బాహుబలి..
పంజా సినిమాతోనే అతని కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అందులో చేసిన హై వోల్టేజ్ నెగిటివ్ రోల్ తోనే అనేక సినిమాల్లో విలన్ పాత్రలు చేసే అవకాశాన్ని అందుకున్నాడు. ఇక బాహుబలిలో కూడా అతను చేసిన పాత్రకు మంచి క్రేజ్ దక్కింది. అప్పటి నుంచి అడివి శేష్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

మంచి మార్కెట్ ను క్రియేట్ చేశాయి
హీరోగా చేసిన క్షణం, గూఢచారి వంటి సినిమాలు అమాంతంగా అతనికి కూడా మంచి మార్కెట్ ను క్రియేట్ చేశాయి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు GMB ప్రొడక్షన్ లో మేజర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ ప్రమోషన్ లో బిజీగా ఉన్న శేష్ ఇటీవల తన పర్సనల్ లైఫ్ గురించి స్పందించాడు. ప్రేమలో ఉన్నట్లు కూడా వివరణ ఇచ్చాడు.
Recommended Video

అవును.. ప్రేమలో ఉన్నాను
ప్రస్తుతం అయితే పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా లేను అంటూ..
ఒక హైదరాబాద్ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చాడు. అయితే ఆ అమ్మాయి వివరాలు మాత్రం పెద్దగా బయటపెట్టలేదు. తన అనుమతి కూడా తీసుకోవాల్సి ఉందని పెళ్లిపై అయితే ప్రస్తుతం ఆలోచన లేదని తాను పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఇంకా మూడు ఉన్నాయని వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications