twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలిలో అడవి శేష్ లుక్ ఇదే!(ఫొటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రభాస్, అనుష్క, రాణా ప్రధాన పాత్రల్లో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'బాహుబలి' చిత్రంలో అడవి శేష్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, రాణాల మాదిరి అడవి శేష్ కూడా ఈచిత్రంలో భారీ గడ్డంతో దర్శనం ఇవ్వనున్నాడు.

    తాజాగా అడవిశేష్‌ గడ్డంతో ఉన్న ఫోటోను రాజమౌళి సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసారు. అడవి శేషు స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'కిస్' చిత్రం ఈ నెల 13న విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో బెస్టాఫ్ లక్ చెబుతూ ఈ ఫోటో పోస్టు చేసారు.

    Adivi Sesh Baahubali look

    కిస్ సినిమా విషయానికొస్తే...అడవి శేషు స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'కిస్'. 'కీపిట్ సింపుల్ స్టుపిడ్' ఇదే ఈ సినిమా ట్యాగ్ లైన్. మైడ్రీమ్స్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్, థౌజండ్ లైట్స్ సినిమా చిత్రం పతాకంపై అడవి సాయికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

    ఈ సినిమా గురించి అడవి శేషు మాట్లాడుతూ...కిస్‌ అంటే కీపిట్‌ సింపుల్‌ స్టుపిడ్‌. సిటీ ఆఫ్‌ సెయింట్‌ ఫ్రాన్సిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. దొంగ వీసాతో అబ్రాడ్‌ వెళ్ళిన ఒక అబ్బాయికి ఇండో అమెరికన్‌ అయిన ఓ అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమాయణమే ఈ చిత్రం అని తెలిపారు.

    ఈ చిత్రంలో పియా బెనర్జీ హీరోయిన్. 'మిస్ కెనడా'గా మార్కులు కొట్టేసి, మోడలింగ్ రంగంలో దూకుడు మీదున్న ఈ అమ్మాయి, 'కిస్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి కెమెరా: షెనీల్‌దియో, సహనిర్మాత: ఆనంద్‌ బచ్చు, నిర్వహణ: భవానీ అడివి, దర్శకత్వం: అడివి శేషు.

    English summary
    
 Adivi Sesh Baahubali look released by Rajamouli. Adivi Sesh playing a crucial role in Baahubali, will soon be seen in KISS. He has played the lead role, written the script and directed the film, which is releasing on September 13.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X