Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాహుబలిలో అడవి శేష్ లుక్ ఇదే!(ఫొటో)
హైదరాబాద్: ప్రభాస్, అనుష్క, రాణా ప్రధాన పాత్రల్లో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'బాహుబలి' చిత్రంలో అడవి శేష్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, రాణాల మాదిరి అడవి శేష్ కూడా ఈచిత్రంలో భారీ గడ్డంతో దర్శనం ఇవ్వనున్నాడు.
తాజాగా అడవిశేష్ గడ్డంతో ఉన్న ఫోటోను రాజమౌళి సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసారు. అడవి శేషు స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'కిస్' చిత్రం ఈ నెల 13న విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో బెస్టాఫ్ లక్ చెబుతూ ఈ ఫోటో పోస్టు చేసారు.
కిస్ సినిమా విషయానికొస్తే...అడవి శేషు స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'కిస్'. 'కీపిట్ సింపుల్ స్టుపిడ్' ఇదే ఈ సినిమా ట్యాగ్ లైన్. మైడ్రీమ్స్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్, థౌజండ్ లైట్స్ సినిమా చిత్రం పతాకంపై అడవి సాయికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా గురించి అడవి శేషు మాట్లాడుతూ...కిస్ అంటే కీపిట్ సింపుల్ స్టుపిడ్. సిటీ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. దొంగ వీసాతో అబ్రాడ్ వెళ్ళిన ఒక అబ్బాయికి ఇండో అమెరికన్ అయిన ఓ అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమాయణమే ఈ చిత్రం అని తెలిపారు.
ఈ చిత్రంలో పియా బెనర్జీ హీరోయిన్. 'మిస్ కెనడా'గా మార్కులు కొట్టేసి, మోడలింగ్ రంగంలో దూకుడు మీదున్న ఈ అమ్మాయి, 'కిస్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి కెమెరా: షెనీల్‌దియో, సహనిర్మాత: ఆనంద్ బచ్చు, నిర్వహణ: భవానీ అడివి, దర్శకత్వం: అడివి శేషు.