twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్‌డేట్స్ ఇస్తుంటారని ఆశిస్తున్నా.. దారుణ ఘటనపై అడివి శేష్ రియాక్షన్

    |

    గర్భం దాల్చిన ఏనుగు.. ఆకలిలో అలమటిస్తూ ఉంటే.. పేలుడు పదార్థాలు ఉన్న పైనాపిల్‌ను తినిపించి దాని మరణానికి కారణమయ్యారు. ఈ ఘటనతో మానవత్వానికే మచ్చ పడింది. ఏనుగు మరణంతో సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దారుణమైన ఘటనపై సామాన్య జనం నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని అంతకంటే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ ఘటనపై స్పందించారు.

    ఏనుగు మృతి చెందిన ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ట్వీట్ చేస్తూ..'మలప్పురంలో జరిగిన ఈ దారుణ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా అక్కడి చిన్న రాయిను కూడా వదలము. ఎలాగైనా నిందితులను పట్టుకుంటాము. మూగ జీవిని ఇంత దారుణంగా చంపడం భారతీయ సంస్కృతి కాద'ని చెప్పుకొచ్చారు.

    Adivi sesh Comments On Prakash Javadekar tweet On Elephant Death

    మంత్రి ట్వీట్‌పై అడివి శేష్ చేసిన కామెంట్ అందర్నీ ఆకట్టుకుంటోంది. అయితే ఇలాంటి ట్వీట్స్, ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్‌ ఒక్క రోజు లేదా రెండు రోజులు హడావిడి చేస్తారు. తరువాత అంతా మరిచిపోతారు. అయితే అలా కాకుడదని భావించిన అడివి శేష్.. మంత్రి ట్వీట్‌పై స్పందిస్తూ.. 'ఈ ఇన్వెస్టిగేషన్‌పై రోజూ మాకు అప్‌డేట్స్ ఇస్తూ ఉంటారని ఆశిస్తున్నా' అని చెప్పుకొచ్చాడు. అడివి శేష్ ప్రస్తుతం మేజర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

    English summary
    Adivi sesh Comments On Prakash Javadekar tweet On Elephant Death. He says that I hope you can periodically update us on the progress of this investigation sir.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X