twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పు కట్టాలని పోలీస్ స్టేషన్లో వేశారు: కష్టాలు వెల్లడిస్తూ అడవి శేష్ ఎమోషనల్ స్పీచ్

    |

    నేను కాలిఫోర్నియా నుంచి వచ్చినప్పటికీ నాకూ కృష్ణానగర్ కష్టాలు ఉన్నాయని 'ఎవరు' మూవీ హీరో అడవి శేష్ తెలిపారు. 'ఎవరు' మూవీ విజయవంతంగా తొలివారం పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడవి శేష్ మాట్లాడుతూ... తాను ఇక్కడి వరకు రావడానికి ఎన్నికష్టాలు పడ్డానో వెల్లడించారు.

    నేను చిన్నతనంలో ఉండగా మా కుటుంబం అమెరికా వెళ్లే ముందు ఒక రెస్టారెంటుకు వెళ్లి తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. యూఎస్ఏలో ఉన్నపుడు మా నాన్న డాక్టర్ అయినప్పటికీ... అక్కడి వారు నాన్న ఎడ్యుకేషన్ ఒప్పుకోలేదు కాబట్టి మా అమ్మ వెయిటర్‌గా, నాన్న రెస్టారెంట్ మేనేజర్‌గా పని చేశారు. అక్కడ కూడా నాకు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కాదు. అంత కష్టపడి మా పేరెంట్స్ నన్ను పెంచారు.

    మేము ఏ రోజూ ఆస్తులు, పొలాలు, ఊర్లో ల్యాండ్, ఇల్లు లేదని బాధ పడలేదు. మా ఇంట్లో క్యాజువల్ సామెత ఏమిటంటే... సరస్వతి ఉన్నచోట లక్ష్మి ఉండదు అని అంతా అనుకునేవారు. అలాంటి పరిస్థితిలో నేను ఇక్కడికి వచ్చాను. నా ఇంగ్లీష్ టాకింగ్, ఫేస్ కట్ చూసి అందరూ అమెరికాలో లాంబొర్గినీ తోలుకుంటూ వెకేషన్ కోసం ఇండియా వస్తాడు, మన మధ్యలో తిరుగుతుంటాడు అనుకునే వారు. నేను కూడా అలాగే వ్యవహరించాను, నాకు అవకాశాలు రావాలనే అలా చేశాను. పది మంది పెద్ద మనషులు మధ్య కూర్చున్నపుడు, వాళ్లు ఏ వాచ్ కొనాలో చర్చించుకునేపుడు నా జేబులో వచ్చే నెల అద్దెకట్టడానికి ఐదువేలు లేవు అని చెప్పుకోలేని పరిస్థితి. అయినా సరే ఇంగ్లీష్ టాకింగ్, ఫేస్ కట్‌తో మేనేజ్ చేసినట్లు అడవిశేష్ తెలిపారు.

    పంజా తర్వాత కూడా నా పరిస్థితి అంతే

    పంజా తర్వాత కూడా నా పరిస్థితి అంతే

    పంజా తర్వాత కూడా నా పరిస్థితి ఇంతే. పంజా తర్వాత చాలా మంది మా సోషల్ సర్కిల్ లో పెద్ద మనుషులు ఒరేయ్ నీకు విలన్ గా ఫాలోయింగ్ వచ్చింది, ఇపుడు నువ్వు హీరోగా మారాలి హీరో అంటే ఇలా కామెడీ చేస్తాడు, డాన్స్ చేస్తాడు అని సలహాలు ఇచ్చేవారు. నేను అప్పట్లో కిస్ అనే సినిమా చేశాను. నా క్రెడిబిలిటీ మీద రెండు మూడు కోట్ల అప్పు చేసి ఆ సినిమా చేశాను. ఆ సినిమాకు పోస్టర్ ఖర్చు కాదు కదా పోస్టర్ అంటించడానికి ఉపయోగించే మైదా ఖర్చులు కూడా రాలేదు. రెండున్నర నుంచి మూడు కోట్లు పోతాయని డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి చెప్పాడు. జేబులో పది వేలు లేని క్యాండేట్ అర్జెంటుగా రెండు మూడు కోట్లు కట్టాలి అనే పరిస్థితి వచ్చింది.

    అప్పు కట్టాలని పోలీస్ స్టేషన్లో వేశారు

    అప్పు కట్టాలని పోలీస్ స్టేషన్లో వేశారు

    అప్పుగా డబ్బులు ఇచ్చినవారు పోలీసులతో ఫోన్ చేయించారు. ఇండియాలో ఆటో కూడా ఎలా హైర్ చేసుకోవాలో, రోడ్డు ఎలా క్రాస్ చేయాలో తెలియని నేను... ఒక సమయంలో ఢిల్లీ పోలిస్ స్టేషన్లో పది మంది పోలీస్ ఆఫీసర్లు చేతిలో లాఠీ పట్టుకుని ఎప్పుడు డబ్బులు ఇస్తావ్ అని బెదిరించడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ అయింది వెర్షన్ 2.0.... నేను అప్పటికప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాను. మనసుకు నచ్చింది మాత్రమే చేస్తాను, మనస్ఫూర్తిగా చేస్తాను. ఎవరి మాట వినను... ఆ సమయంలో మా ఫ్యామిలీ మాట కూడా వినలేదు.

    అప్పుడు ఎవరూ నమ్మలేదు, ఇపుడు అందరూ నమ్ముతున్నారు

    అప్పుడు ఎవరూ నమ్మలేదు, ఇపుడు అందరూ నమ్ముతున్నారు

    అదే సమయంలో లక్కీగా పివిపిగారు క్షణం సినిమా చేయడం జరిగింది. అక్కడి నుంచి నా 2.0 ప్రయణం మొదలైంది. ఇపుడు కూడా వచ్చేపుడు మా ఇంట్లో గచ్చి బౌలి నుంచి ఫిల్మ్ నగర్ దాకా వచ్చేపుడు నా సెకండ్ వీక్ పోస్టర్లు కనిపించలేదనే కోపం ఉంది. నాకు సినిమా నిలబడటం అంత ముఖ్యం. సినిమా నిలబడితేనే అందరూ మాట్లాడుకుంటారు. సినిమా నిలబడితేనే మరొకసారి నేను పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టను. ఈ రోజు ఉదయం లేవగానే కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయని కొందరు పంపారు. వరుసగా 4 సినిమాలు హిట్టు, మినిమమ్ గ్యారంటీ హీరో, నమ్మొచ్చు అనే టాక్ ఉందని తెలిపారు. అపుడు నాకు మనసులో వచ్చిన ఆలోచన ఏమిటంటే... నన్ను ఎవరూ నమ్మనిరోజునే కదా పోలీసులు వచ్చారు. ఇపుడు అందరూ నమ్ముతున్నారు.

    ఆయన వల్లే నేను ఇపుడు ఇండస్ట్రీలో ఉన్నాను

    ఆయన వల్లే నేను ఇపుడు ఇండస్ట్రీలో ఉన్నాను

    గత 48 గంటల్లో ఆరుగురు నిర్మాతలు ఫోన్ చేసి కథ ఏదైనా చెప్పమ్మా.. నీ మీద నమ్మకం ఉంది అంటున్నారు. ఈ నమ్మకం కోసమే నేను పని చేశాను. నాకు డబ్బు లేని సమయంలో నాకు అండగా ఉంది ఎవరంటే అబ్బూరి రవిగారు. నన్ను లిటరర్ గా నిలబెట్టారు. నాకు ఎవరైనా బ్యాగ్రౌండ్ ఉన్నారంటే అది అబ్బూరిగారే. పంజా డైలాగులు రాసింది, నా క్యారెక్టర్ ను ఎలివేట్ చేసింది ఆయనే. క్షణం సినిమాలో డైలాగులు, స్క్రిప్ట్ గైడెన్స్ ఇచ్చింది ఆయనే, గూఢచారి డైలాగ్స్, స్క్రిప్ట్ గైడెన్స్ ఇచ్చింది ఆయనే, ఎవరు డైలాగ్స్, స్క్రిప్టు గైడెన్స్ ఇచ్చింది ఆయనే. ఆయన లేకుండా ఈ రోజు నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేను అని నమ్ముతున్నాను.

    ఇదీ నా జర్నీ, నా గ్రాఫ్... చనిపోయిన తర్వాత కూడా ఆ పేరే కావాలి

    ఇదీ నా జర్నీ, నా గ్రాఫ్... చనిపోయిన తర్వాత కూడా ఆ పేరే కావాలి

    ‘ఎవరు' తర్వాత ఇపుడు నా హిందీ డెబ్యూ... అదండీ నా జర్నీ, నా గ్రాఫ్. చాలా మందికి పర్సనల్ కష్టాలు ఉంటాయి. నేను ఎప్పుడూ చెప్పుకోలేదు కాబట్టి హానెస్టుగా చెప్పుకోవాలని ఇపుడు చెప్పాను. అంతకు మించి ఏమీ లేదు. థ్రిల్లింగ్ స్టార్, బడ్జెట్ స్టార్ అనే దానిపై నాకు ఇంట్రస్ట్ లేదు. మంచి సినిమాలు చేయడంపై మాత్రమే ఇంట్రస్ట్ ఉంది. నేను చనిపోయిన తర్వాత కూడా గుడ్ సినిమాల శేష్ అనే పేరు రావాలి.. అదే నా కోరిక అదే. అతను ఉంటే సినిమా బావుంటుంది అని జనాలు నమ్మాలి. నాకు ఫ్యాన్స్ వద్దు, పూల దండలు వద్దు, పాలాభిషేకాలు వద్దు. మంచి సినిమా చేస్తాడనే పేరు కావాలి. మంచి సినిమానే స్పాట్ బాయ్ నుంచి ప్రేక్షకుడి దాకా అందరికీ ఆనందం ఇస్తుంది.

    ఎవరు లాభాల్లో...

    ఎవరు లాభాల్లో...

    ‘ఎవరు' సినిమా నిన్నటితో వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్లు బ్రేక్ ఈవెన్ అయిపోయారు. సెకండ్ వీకెండ్ నుంచి వచ్చే ప్రతి రూపాయి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, థియేటర్ ఓనర్లకు, సైకిల్ స్టాండ్ వాళ్లకు ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుందని అడవి శేష్ తెలిపారు.

    English summary
    Adivi Sesh Heart Touching Emotional Speech at Evaru thanks meet. Evaru is an Indian Telugu-language crime thriller film directed by Venkat Ramji. The film produced by Pearl V Potluri, Param V Potluri and Kavin Anne. The film starring Adivi Sesh, Regina Cassandra, and Naveen Chandra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X