HIT 2 Twitter Review: హిట్ 2 మూవీకి అలాంటి టాక్.. అదే పెద్ద మైనస్.. ఇంతకీ శేష్ హిట్ కొట్టాడా అంటే!
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన టాలెంట్లతో ప్రేక్షకుల మనసులు దోచుకుంటోన్నారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే అదిరిపోయే యాక్టింగ్‌తో సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ యంగ్ హీరో అడవి శేష్ ఒకడు. హీరోగా పరిచయమైనప్పటి నుంచి విభిన్నమైన చిత్రాలను చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'హిట్ ద సెకెండ్ కేస్' అనే క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ఆ మూవీ ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి మరి!

సెకెండ్ కేస్ కోసం వచ్చిన కేడీ
క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో 'హిట్' సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు దానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రమే 'హిట్: ది సెకెండ్ కేస్'. అడివి శేష్ హీరోగా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించాడు. నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు.

మరో థ్రిల్లర్.. పాత దానికంటే
బద్దకస్తుడిగా పేరు తెచ్చుకున్న ఓ పోలీస్ ఆఫీసర్ దేశమే ఉలిక్కిపడే క్రైమ్‌ను ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంతకీ అతడు నేరస్థుడిని ఎలా పట్టుకున్నాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రమే 'హిట్: ది సెకెండ్ కేస్'. అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రం మొదటి భాగం కంటే మరింత కొత్తగా, థ్రిల్లింగ్‌గా రూపొందినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ట్విట్టర్‌లో మూవీకి టాక్ ఇలా
అడివి శేష్ నటించిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీ ఎన్నో అంచనాల నడుమ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా ఏరియాల్లో ఈ సినిమా షోలు పడ్డాయి. దీంతో ట్విట్టర్ వేదికగా చాలా మంది ఈ సినిమాపై తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. నెటిజన్ల నుంచి మాత్రం ఈ సినిమాకు పాజిటివ్ టాక్ దక్కిందని చెప్పొచ్చు.
ఫస్టాఫ్ అలా.. ఇంటర్వెల్‌లో
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీని చూసిన ఓ నెటిజన్ చెప్పిన దాని ప్రకారం.. ఈ మూవీ ఫస్టాఫ్ అదిరిపోయేలా ఉందట. 'ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆసక్తిని రేకెత్తించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. సినిమా ఫలితం సెకెండాఫ్‌పై ఆధారపడి ఉంటుంది' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
సెకెండాఫ్ అలా ఉందట
నాని నిర్మాతగా అడివి శేష్ - శైలేష్ కొలను కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'హిట్: ది సెకెండ్ కేస్'. ఈ మూవీని చూసిన మరో నెటిజన్ ట్విట్టర్ ఖాతా ద్వారా 'హిట్ 2 మంచి థ్రిల్లర్. సెకెండాఫ్ మొత్తం మనల్నీ సీటుపై కూర్చునేలా చేస్తుంది. హిట్ మెషీన్ అయిన అడివి శేష్ మరో మంచి సినిమాను అందించాడు' అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
అన్నీ ప్లస్‌లో అంటూ ఒకరు
అడివి శేష్ - శైలేష్ కొలను కాంబినేషన్‌లో రూపొందిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీని వీక్షించిన మరో నెటిజన్ ట్విట్టర్ ఖాతాలో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. 'బ్లాక్ బస్టర్ మూవీ. దీనికి నా రేటింగ్ 3.25. ఇందులో అడివి శేష్ యాక్టింగ్, విలన్ క్లైమాక్స్ ఎపిసోడ్, స్టోరీ ప్లస్ పాయింట్లు. ఇక, ఇందులో నాకు ఎలాంటి మైనస్ పాయింట్ కనిపించలేదు' అంటూ పోస్ట్ చేశాడు.
డీసెంట్ థ్రిల్లర్.. మైనస్‌గా
అడివి శేష్ హీరోగా నటించిన ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్ మూవీ 'హిట్: ది సెకెండ్ కేస్'ను వీక్షించిన మరో నెటిజన్ ట్విట్టర్‌లో 'హిట్ 2 డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో అడివి శేష్ యాక్టింగ్, సినిమా రన్ టైమ్, ఎంగేజింగ్‌గా సాగిన స్క్రీన్‌ప్లే ప్లస్ పాయింట్లుగా చెప్పొచ్చు. అలాగే, రొటీన్ కథ దీనికి మైనస్‌గా మారింది' అంటూ చెప్పారు. ఇలా చాలా మంది స్టోరీ కొత్తగా లేదని అంటున్నారు.
సినిమాలో ఎవరెలా చేశారు
అడివి శేష్ నటించిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీని చూసిన ఓ నెటిజన్ 'ఇందులో అడివి శేష్ యాక్టింగ్ బాగుంది. శైలేష్ కొలను దర్శకత్వం ఆకట్టుకుంది. నాని ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. విలన్ విషయంలో సస్పెన్స్ కూడా బాగా నచ్చింది. బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉన్నాయి. అన్నింటికీ మించి క్లైమాక్స్ బాగుంది' అంటూ ట్వీట్ చేశాడు.

మొత్తంగా ఎలా ఉందంటే
అడివి శేష్ నటించిన 'హిట్: ది సెకెండ్ కేస్'పై ఇంకో నెటిజన్ స్పందిస్తూ.. 'అత్యుత్తమ నటనలతో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ మూవీనే హిట్ 2. ఇందులో లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్‌తో పాటు కొన్ని సామాజిక అంశాలను చూపించిన తీరు బాగుంది. అంతేకాదు ఫేక్ ఎన్‌కౌంట్లర్లపై కూడా ఇందులో కౌంటర్ వేసినట్లుగా చూపించారు. మొత్తంగా మూవీ బాగుంది' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











