పంజా విలన్....ఇప్పడు హీరోగా ‘కిస్’
హైదరాబాద్ : ఆ మధ్య వచ్చిన కర్మ సినిమా ద్వారా యాక్టర్ గా, డైరెక్టర్ గా తెలుగు సినిమారంగంలోకి ఎంటరైన అడవి శేష్...పంజా సినిమాలో నెగెటివ్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత మళ్లీ అడవి శేష్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
'కిస్' పేరుతో రూపొందుతున్న ఈచిత్రానికి దర్శకుడు కూడా అడవి శేషే. మిస్ కెనడా పజెంట్ ప్రియా బెనర్జీ ఈచిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ చిత్రంలో ఇంకా టాలీవుడ్ నటులు షఫి, భరత్ రెడ్డి ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఈ చిత్రాన్ని సాయి కిరణ్ అడవి, ఆనంద్ బచ్చు సంయుక్తంగా మైడ్రీమ్ సినిమా మరియు థౌజండ్ లైట్స్ బేనర్లపై నిర్మిస్తున్నారు. వేసవిలో ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కొరియో గ్రఫీ : శానియల్ డియో, సంగీతం : శ్రీచరణ్ పాకాల, పేటె వండర్.
మరో వైపు అడవి శేష్ రవితేజ హీరోగా రూపొందుతున్న 'బలుపు' చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. మరి గతంలో 'కర్మ' సినిమాకు దర్శకత్వం వహించి స్వయంగా నటించి....ఇదేం కర్మరా బాబూ అనే ఫీలింగ్ తెప్పించిన అడవి శేష్ 'కిస్' సినిమాతో ప్రేక్షకులకు ఎలాంటి ఫీలింగ్ తెప్పిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications












